TDP worker have rejects the benefits: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు జోరుగా జనంలోకి వెళుతున్నారు. సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు ఇంటిఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో జరిగిన ఘటన ఏపీలో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో పెద్ద రచ్చైంది. ఈ ఘటనను టీడీపీ తమకు అనుకూలంగా మలుచుకోగా.. అధికార పార్టీ మరోలా కౌంటర్ ఇస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తాడిమర్రి మండలం ఎం.అగ్రహారంలో పర్యటించారు. గడపగడపకు వెళుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లారు. టీడీపీ కార్యకర్త అయిన కొండన్న గారి శివయ్య తన ఇంటిమీద పసుపు జెండా కట్టాడు. టీడీపీ కార్యకర్త అని తెలిసినా శివయ్యతో మాట్లాడేందుకు వెళ్లారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఇక్కడే షాకింగ్ ఘటన జరిగింది.  ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన బ్రోచర్‌ను ఎమ్మెల్యే ఇవ్వగా.. తీసుకోవడానికి శివయ్య నిరాకరించాడు. జగన్ సర్కార్ పథకాలు తమకు అవసరం లేదని ఎమ్మెల్యే ముఖం మీదే చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీడీపీ పెద్ద ఎత్తున సర్కూలేట్ చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త సత్తా ఇదీ అంటూ ప్రచారం చేసుకుంది.


ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన ఘటనపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ఎదురైన ఘటనను ఉదహరిస్తూ జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను వివరించారు. తమ ఎమ్మెల్యే గడప గడపకు వస్తోండటంతో కావాలనే ఇంటిపై తెలుగుదేశం జెండా కట్టారని చెప్పారు. తమకు ప్రభుత్వ పథకాలు అవసరంలేదన్న కొండన్నగారి శివయ్యకు గత మూడేళ్లలో 90 వేల రూపాయలకు పైగా లబ్ది జరిగిందని చెప్పారు. ఇందుకు సంబంధించి వివరాలను విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.  కులం, మతం, ప్రాంతం, పార్టీ, వర్గ భేదాలు లేకుండా జగన్ పాలనలో అందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు.



Read Also: Bathukamma Sarees: ప్లాస్టిక్ టబ్బులకు, కూరగాయల మూటలకు బతుకమ్మ చీరలు!


Read Also: నీటిలోంచి యాభై అడుగుల పోస్టర్.. అయోధ్యలో ఆదిపురుష్ హంగామా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి