హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేటి మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సమావేశం కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ, తెలంగాణలలో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్, జగన్‌ల భేటీ రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.  కొన్ని గంటలపాటు జరిగే ఈ ప్రత్యేక సమావేశంలో.. తాజా రాజకీయ అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని పరిష్కారం కాని అంశాలు, జలవనరుల సద్వినియోగం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ అంశంపై గతంలోనూ చర్చలు జరిగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44000 క్యూసెక్కుల నుంచి 80000 క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా చర్చిస్తారు. ఈ పెంపు నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ఏర్పాటయ్యాక టీఆర్ఎస్ సర్కార్ రిలీవ్ చేసిన 650 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. ఈ విషయంపై కూడా చర్చ జరగవచ్చు. రాష్ట్ర విభజన విషయాల్లో పెండింగ్‌లో ఉన్న షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై స్పష్టత కోసం చర్చలు. 


గతంలో జరిగిన భేటీకి కేసీఆర్, జగన్‌లతో పాటు కొందరు ఉన్నతాధికారులు హాజరయ్యేవారు. కానీ తాజా భేటీలో కేవలం ఇరు రాష్ట్రాల సీఎంలు మాత్రమే పాల్గొనడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల అంశాలతో పాటు పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఎన్ఆర్‌సీ విషయాల్లో కేంద్రం వైఖరికి మద్దతు తెలపాలా.. వద్దా, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఏపీ రాజధాని అమరావతి, తదితర అంశాలపై కేసీఆర్, వైఎస్ జగన్ చర్చిస్తారని సమాచారం.          జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..