Andhra Pradesh: భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మద్యం అక్రమ రవాణా ( Illegal liquor In AP ) ఏమాత్రం ఆగడం లేదు. కొన్ని నెలల నుంచి లాక్షలాది రూపాయల మద్యం బాటిళ్లను ఏపీ పోలీసులు పట్టుకుంటునే ఉన్నారు. అయినప్పటికీ మద్యం అక్రమ రవాణా దర్జాగా కొనసాగుతూనే ఉంది.
liquor bottles seized: అమరావతి: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మద్యం అక్రమ రవాణా ( Illegal liquor In AP ) ఏమాత్రం ఆగడం లేదు. కొన్ని నెలల నుంచి లాక్షలాది రూపాయల మద్యం బాటిళ్లను ఏపీ పోలీసులు ( AP Police ) పట్టుకుంటునే ఉన్నారు. అయినప్పటికీ మద్యం అక్రమ రవాణా దర్జాగా కొనసాగుతూనే ఉంది. తాజాగా బుధవారం అర్థరాత్రి తెలంగాణలోని అశ్వారావుపేట నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి ఆటోలో తరలిస్తున్న రూ.20లక్షల విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Also read: ఆర్టీసీ బస్సులో మద్యం అక్రమ రవాణా.. చాకచక్యంగా పట్టుకున్న ఏపీ పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నుంచి ట్రక్కు ఆటోలో అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తుండగా.. జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద జిల్లా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (SEB) ఏఎస్పీ కరీముల్లా షరీఫ్, ఎస్ఐ విశ్వనాథం పట్టుకున్నారు. పోలీసు బృందం వాహనాలను తనిఖీ చేస్తుండగా.. సుమారు 20లక్షలు విలువచేసే 4,275 మద్యం బాటిళ్లు పట్టుబడినట్లు షరీఫ్ తెలిపారు. అయితే.. ఆటోలో ఉన్న ఒక వ్యక్తి పట్టుబడ్డాడని, మరో ఇద్దరు పరారైనట్లు ఆయన వెల్లడించారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన వ్యక్తిని రిమాండ్‌కి తరలించామన్నారు. మిగతా వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. Actress Rekha Suicide: యాంకర్, టీవీ నటి రేఖ ఆత్మహత్య
ఇటీవల కాలంలో తెలంగాణ మద్యం బాటిళ్లను అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌కు భారీగా తరలిస్తున్నారు. ఏపీలో ధరలు ఎక్కువగా ఉండటంతో తెలంగాణ నుంచి మద్యం బాటిళ్లను తీసుకెళ్లి ఏపీలో అక్రమంగా విక్రయిస్తూ వ్యాపారులు భారీగా దండుకుంటున్నారు. Also read: Home Quarantine: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం