Shock To YSRCP: డోర్లు తెరిచిన సీఎం చంద్రబాబు.. టీడీపీలోకి వైసీపీ మాజీ ఎంపీలు
YSRCP Ex MPs Joins Into TDP: అధికార టీడీపీ చేరికలకు ద్వారాలు తెరవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు పచ్చ కండువా కప్పేసుకున్నారు. వైఎస్ జగన్‌ను ఒంటరి చేయాలని టీడీపీ భావిస్తోంది.
Telugu Desam Party Opens Doors: అధికారంలోకి వచ్చాక తొలిసారి తెలుగుదేశం పార్టీ రాజకీయ చేరికలకు తలుపులు తెరిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ దెబ్బ తీసేలా వేసిన వ్యూహ రచనలో టీడీపీ విజయవంతమైంది. వైసీపీ రాజ్యసభ ఎంపీలను విచ్ఛిన్నం చేసి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ షాకిచ్చారు. తమ వ్యూహంలో భాగంగా రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన మాజీ ఎంపీలు తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పసుపు కండువా కప్పారు.
ఉండవల్లిలోని తన నివాసంలో తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణా రావు, బీద మస్తాన్ రావులను చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. పార్టీలోకి స్వాగతం పలికి వారికి రాజకీయ దిశానిర్దేశం చేశారు. త్వరలో మరికొందరు కూడా పార్టీలో చేరుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీని కోలుకోలేని విధంగా చేయాలని వ్యూహం రచిస్తోంది. మిగత నాయకులు కూడా అధికార పార్టీ గూటికి చేరే అవకాశం ఉంది.
Also Read: Ys Jagan On Haryana Results: హర్యానా ఎన్నికలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
కాగా అంతకుముందు జరిగిన మీడియా చిట్‌చాట్‌లో చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న జమిలి ఎన్నికలకు ఆయన మద్దతు ప్రకటించారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు. వైసీపీ పాలనలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. తనను చివరికి చంపే ప్రయత్నం చేశారని తెలిపారు. జైలులో వేడి నీళ్లు ఇవ్వకుండా.. దోమతెర ఏర్పాటుచేయకుండా ఇబ్బందులకు గురి చేసిన వారిపై కక్ష తీర్చుకోవాలి కదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అయితే తనది అలాంటి మనస్తత్వం కాదని.. తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరని హెచ్చరించారు.
సరైన సమయంలో చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. మద్యం టెండర్లు పాదర్శకంగా జరిగేలా చూస్తామని సీఎం తెలిపారు. ఈ వ్యవహారంలో పార్టీ నాయకులు జోక్యం చేసుకుంటే సహించమని హెచ్చరించారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజలను ఇబ్బంది పెట్టేది కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇసుక విధానంపై కూడా ఆసక్తికర విషయాలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.