Ys Jagan On Haryana Results: హర్యానా ఎన్నికలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Ys Jagan On Haryana Results in Telugu: ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా వచ్చిన హర్యానా ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఇటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇదే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలు మారుతున్న రాజకీయ పరిణామాలకు అద్దం పట్టనున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 9, 2024, 07:44 PM IST
Ys Jagan On Haryana Results: హర్యానా ఎన్నికలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Ys Jagan On Haryana Results in Telugu: దేశంలో ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా హర్యానా ఫలితాలు ఊహించకుండా ఉన్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకు పట్టం కట్టగా ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. హర్యానా ఫలితాల నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

హర్యానా ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ అక్కడ మరోసారి బీజేపీ అధికారంలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 37 సీట్లకు పరిమితమైంది. దేశంలోని ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఏ ఒక్కరిదీ నిజం కాలేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం అభిప్రాయాలుక వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలున్నాయని స్పష్టం చేశారు. హర్యానా ఫలితాలు ఏపీలో ఫలితాలలానే ఉన్నాయన్నారు. ఇప్పటికే ఏపీ ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని గుర్తు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం పోలింగ్ కోసం సమర్ధనీయం కాదన్నారు. దేశంలో పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. 

అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ల పద్థతినే వినియోగిస్తున్న సంగతిని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్ దేశాల్లో ఇప్పటికే బ్యాలెట్ పద్ధతే ఉపయోగిస్తున్నారని చెప్పారు. దేశంలో కూడా బ్యాలెట్ పద్ధతిని ఉపయోగిస్తే ఓటర్లలో విశ్వాసం పెరుగుతుందని, అందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

హర్యానా ఫలితాలపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. బీజేపీతో జగన్ పూర్తిగా దూరమైనట్టేననే సంకేతాలు వస్తున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉండటంతో రాజకీయ సమీకరణాలు మారవచ్చని తెలుస్తోంది. గెలిచిన బీజేపీకు వ్యతిరేకంగా మాట్లాడటం జగన్ కు బహుశా ఇదే తొలిసారి. అందుకే జగన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. బ్యాలెట్ పేపర్ పద్ధతికి మద్దతివ్వాలని ఆయన ఇచ్చిన పిలుపుకు ఎవరెవరు ఎలా స్పందిస్తారో చూడాలి. 

Also read: AP DSC 2024 Notification: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తేదీ ఖరారు, ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News