Chandrababu Case Updates: కాస్సేపట్లో ఏసీబీ కోర్టులో చంద్రబాబు హాజరు, మొహరించిన ఢిల్లీ న్యాయవాదులు
Chandrababu Case Updates: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి 24 కావస్తోంది. ఈ నేపధ్యంలో మరి కాస్సేపట్లో సీఐడీ కోర్టు న్యాయమూర్తి ముందు చంద్రబాబును హాజరుపర్చనున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టైన చంద్రబాబును సీఐడీ దాదాపు 10 గంటలు విచారించింది. విచారణ ముగిసిన తరువాత విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇప్పుడు మరి కాస్సేపట్లో జడ్జి సమక్షంలో ప్రవేశపెట్టనున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుని ఏసీసీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు. ప్రత్యేక విమానానికి అనుమతి రాకపోవడంతో రోడ్డుమార్గాన విజయవాడ చేరుకునేందుకు ప్రయత్నించారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడంతో పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిన్న ఉదయం 6 గంటలకు చంద్రబాబుని నంధ్యాలలో అరెస్టు చేసిన ఏపీసీఐడీ విభాగం...సాయంత్రానికి విజయవాడకు చేరుకుంది. దాదాపు 10 గంటలు తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారణ జరిపింది. అయితే ఏ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అరెస్టు చేసి 24 గంటలు కావస్తుండటంతో మరి కాస్సేపట్లో చంద్రబాబుని ఏసీబీ కోర్టులో హాజరుపర్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు.
మరోవైపు డిల్లీ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో చేరుకున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టు వద్దుకు వచ్చారు. అటు నారా లోకేష్ కూడా కోర్టుకు చేరుకున్నారు.చంద్రబాబు నాయుడి అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటీషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. రిమాండ్ రిపోర్ట్ లేకుండా హౌస్ మోషన్ పిటీషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. రిమాండ్ రిపోర్ట్‌తో మరోసారి పిటీషన్ దాఖలు చేయాలని కోరింది.
Also read: Chandrababu CID investigation exclusive video: చంద్రబాబు సీఐడీ విచారణ దృశ్యాలు ఎక్స్‌క్లూజీవ్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook