Ayyannapatrudu Comments: ఏపీలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జగన్ మూడేళ్ల పాలనపై విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. ఇటు మంత్రులు, వైసీపీ నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం ఓ దుర్మార్గుడి చేతిలో ఉందని హాట్ కామెంట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ ప్రారంభ సమయంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకుని..ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ..వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఏపీని ఓ దుర్మార్గుడి చేతి నుంచి రక్షించాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. 


వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఆలయాలకు వచ్చే భక్తులను సైతం వదిలిపెట్టడం లేదన్నారు. తిరుమలలో భక్తులకు సరైన వసతులు కల్పించడంలో విఫలమయ్యారని చెప్పారు. హిందూ సంప్రదాయాన్ని ప్రచారం చేయడంలో టీటీడీ విఫలమయ్యిందని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.


ఒంగోలులో మహానాడుకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని ఫైర్ అయ్యారు. మహానాడుకు ఎన్ని అడ్డంకులు ఇచ్చినా..కార్యక్రమ నిర్వహణకు రైతులు ముందుకు వచ్చి భూమి ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మహానాడు సక్సెస్ అయ్యిందన్నారు. ప్రజలంతా భారీగా తరలివచ్చారని తెలిపారు. దుర్మార్గుడి పరిపాలనకు మహానాడే నాంది అని స్పష్టం చేశారు. 


Also read:Guntur: గుంటూరులో దారుణం... బ్లేడుతో తల్లీకూతుళ్లపై దాడి చేసిన యువకుడు...   


Also read:Telangana Courts: తెలంగాణ చరిత్రలో మరో నవ శకం..కొలువు దీరనున్న జిల్లా కోర్టులు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook