Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అప్పుడే 43 రోజుల జైలు జీవితం గడిచిపోయింది. క్వాష్ లేదా బెయిల్ పిటీషన్లపై ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కన్పించడం లేదు. చంద్రబాబు పెళ్లి రోజు నుంచి దసరా వరకూ జైలుకే పరిమితమైపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవినీతి కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అన్నీ ప్రతికూలంగా మారుతున్నాయి. ఇప్పట్లో బయటికొచ్చే పరిస్థితులు కన్పించకపోవడంతో చంద్రబాబు కుటుంబసభ్యులతో పాటు టీడీపీ వర్గాల్లో కలవరం పెరుగుతోంది. పెళ్లి రోజు నుంచి దసరా వరకూ అంతా  జైళ్లోనే గడిచిపోతోంది. మధ్యలో వినాయక చవితి సైతం జైళ్లోనే ముగిసింది. స్కిల్ కేసులో సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని వాదిస్తూ కేసు కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ కీలకమైంది. ఈ పిటీషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పు వచ్చేస్తుందనుకుని ఆశించిన తరుణంలో నవంబర్ 8కు వాయిదా పడింది. మరోవైపు చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు నవంబర్ 1 వరకూ పొడిగించింది.


ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై తీర్పు నవంబర్ 8కు వాయిదా పడింది. స్కిల్ కేసులో మద్యంతర బెయిల్ పిటీషన్‌ను ఇప్పటికే హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు సైతం ఇప్పుడు కలగజేసుకోమని స్పష్టం చేసింది. నవంబర్ 1 వరకూ కోర్టుకు సెలవులున్నాయి. ఈలోగా వెకేషన్ బెంచ్‌పై చంద్రబాబు కేసులు విచారణకు రానున్నా..ఫలితం తేలే అవకాశాలు కన్పించడం లేదు. దాంతో నవంబర్ 8 వరకైతే చంద్రబాబు జైళ్లోనే గడపాల్సిన పరిస్థితి ఉంది.


ప్రశాంత్ భూషణ్ పిటీషన్ సమస్య కానుందా


దీనికితోడు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ చంద్రబాబుకు కొత్త అడ్డంకి తెచ్చే అవకాశాలు లేకపోలేదు. సెక్షన్ 17ఏ ఉనికిని ప్రశ్నిస్తూ పిటీషన్ దాఖలైంది. సెక్షన్ 17ఏ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ సమ్మతం కాదనేది పిటీషనర్ వాదన. ఈ కేసులో ప్రభుత్వ అధికారిపై దర్యాప్తు ప్రారంభించందుకు గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి చేసే సెక్షన్ 17ఏను సవాలు చేస్తూ ప్రశాంత్ భూషణ్ పిటీషన్ దాఖలు చేశారు.


ఈ క్రమంలో చంద్రబాబుకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కన్పించడం లేదు. దీనికితోడు ఏపీ ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసు ఉండనే ఉన్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీని నడిపించే బాధ్యతను భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ భుజాలనెత్తుకుంటున్నారు. 


Also read: CM Jagan: ఆసియా గేమ్స్‌ పతక విజేతలకు నగదు పురస్కారం.. ఒక్కొక్కరికి ఎంతంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook