Telugu Desam: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విబేధాలు బట్టబయలవుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉన్న సీనియర్ నేతకు ఇప్పుడు కోపమొచ్చింది. పార్టీ వీడుతానంటూ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు(Chandrababu) కంటే సీనియర్ రాజమండ్రికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాలో కూడా రాజమండ్రి రూరల్(Rajahmundry Rural) నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన నేత. ఇప్పుడు పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకత్వంపై నిరసన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న అంతర్గత వర్గ విబేధాలు ఆయన్ని తీవ్రంగా కలచివేశాయి. పార్టీలో ఆయనకు వ్యతిరేకవర్గంగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు వర్గానికి పార్టీ నాయకత్వం ప్రాముఖ్యత ఇవ్వడమే దీనికి కారణం. తన వర్గాన్ని పార్టీ పట్టించుకోవడం లేదని బహిరంగంగానే ఆవేదన చెందారు. 


తెలుగుదేశం పార్టీ(Telugu Desam) మనుగడ కోసమే తన పోరాటమని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని త్వరలో బహిరంగంగా చెబుతానని ప్రకటించిన ఆయన..ఈ నెల 25న పార్టీకు రాజీనామా చేయనున్నట్టు సమాచారం. పార్టీలో తాను ఒంటరివాడినంటూ ఉద్వేగానికి లోనవడం అందర్నీ కలచివేసింది. స్థానిక అంశాల్ని పట్టించుకోవడం లేదని..సిద్ధాంతపరమైన లోపాలపై అసంతృప్తిగా ఉన్నానంటున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తి వ్యవహారంపై మాజీ హోంమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప(China Rajappa)స్పందించారు. బుచ్చయ్య చౌదరి ఓ సీనియర్ నాయకుడని..స్థానికంగా ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. 2-3 రోజుల్లో గోరంట్లతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లి చర్చిస్తామన్నారు. 


గోరంట్ల బుచ్చయ్య చౌదరికి (Gorantla Butchaiah chowdary) స్థానికంగా రాజమండ్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలపై మంచి పట్టుంది. అందుకే రాజమండ్రి సిటీ నుంచి కాకుండా రాజమండ్రి రూరల్ సీటు కేటాయించినా సరే 2014, 2019లలో వరుసగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. స్థానిక రాజకీయాలపై, స్థానిక ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన నేత కావడం వల్లనే స్థానం మారినా విజయం సాధిస్తూ వస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గోరంట్లను పక్కనబెట్టి..పార్టీ నాయకత్వం ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం సహజంగానే అసంతృప్తి కల్గించే అంశం. అదే ఇప్పుడు జరిగింది. 


Also read: Polavaram Project: వరద సమయంలోనూ శరవేగంగా సాగుతున్న పోలవరం పనులు