Gorantla Buchiah Chowdary: రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి హ్యాట్రిక్ విజయం
Gorantla Buchiah Chowdary: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలొచ్చాయి. ఆధిక్యంలో తొలి బోణీ ఇచ్చిన స్థానమే విజయంలో కూడా ఇచ్చింది. రాజమండ్రి రూరల్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gorantla Buchiah Chowdary: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఫలితాల్లో తొలి విజయాన్ని రాజమండ్రి రూరల్ తెలుగుదేశం అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్య చౌదరి నమోదు చేశారు. అది కూడా భారీ విజయంతో వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం దాదాపుగా ఖరారైంది. తెలుగుదేశం 130 స్థానాల్లో , జనసేన 20 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 18 సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఎన్నికల్లో తొలి విజయాన్ని రాజమండ్రి రూరల్ అభ్యర్ణి గోరంట్ట బుచ్చయ్య చౌదరి దక్కించుకున్నారు. కౌంటింగ్ ప్రారంభం కాగానే తొలి ఆదిక్యాన్ని నమోదు చేసింది కూడా ఈయనే. సమీప వైసీపీ అభ్యర్ధి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ నుంచి లీడ్ కొనసాగించిన బుచ్చయ్య చౌదరి 20 రౌండ్ల వరకూ అదే ఆధిక్యం చూపించారు. 63 వేలకు పైగా ఆధిక్యంతో విజయం సాధించారు. బుచ్చయ్య చౌదరికి 1 లక్షా 29 వేల 60 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్ధి వేణు గోపాలకృష్ణకు 64,970 ఓట్లు వచ్చాయి.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి బుచ్చయ్య చౌదరి విజయం సాధించడం ఇది వరుసగా మూడోసారి. అంతకుముంచు 2014, 2019లో వరుసగా రెండుసార్లు భారీ మెజార్టీతోనే విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. 2014 కంటే ముందు గోరంట్ల బుచ్చయ్య చౌదరి 1983, 1985, 1994, 1999లో రాజమండ్రి సిటీ నుంచి గెలిచారు. 2004, 2009లో మాత్రమే పరాజయం చెందారు. అంటే ఇప్పటి వరకూ 7 సార్లు విజయం సాధించారు.
తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్. పార్టీ స్థాపించినప్పుడు ఉన్న యనమల రామకృష్ణుడు వంటి నేతలకు సమకాలీకుడు.
Also read: Andhra Pradesh Assembly Election Results Live: ఏపీలో టీడీపీ సునామీ.. ఘోర ఓటమి దిశగా వైసీపీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook