అమరావతి : రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టి ఉందని బడ్జెట్‌ ముందు వరకు హోరెత్తించారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపించిందంటూ విజయసాయిరెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ పేర్కొంది. 22 మంది ఎంపీలున్న వైసీపీ, కేంద్రం మెడలు వంచటమంటే ఇదేనా? అని టీడీపీ మండిపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేకహోదా, వెనకబడిన జిల్లాలకు నిధులు సహా రాష్ట్రానికి సంబంధించిందించిన ఒక్క అంశం కూడా లేదంటే అది జగన్‌  ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని టీడీపీ పేర్కొంది. ఏపీకి కొత్త రైల్వే ప్రాజెక్టు సాధించలేదు. 13 జిల్లాలకు జీవనాడైనా పోలవరానికి ఒక్క రూపాయి నిధులు రప్పించుకోలేకపోయారని విమర్శించింది.


రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు నాశనం చేశారని, 8నెలల్లోనే రూ 40వేల కోట్ల అప్పులు చేసి, ఆర్టీసి, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని పేర్కొంది. పేదల కొనుగోలు శక్తి, పొదుపు శక్తిని దెబ్బతీశారని టీడీపీ ఎద్దేవా చేసింది. కేంద్రాన్ని మెప్పించి నిధులు రాబట్టడంలో ఘోరంగా విఫలం చెందారని, రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాల వల్లే కేంద్ర బడ్జెట్లో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించింది. విభజన చట్టం ప్రకారం నిధులు కూడా తెచ్చుకోలేక పోయారని, దీనిపై రాష్ట్ర ప్రజలకు  సీఎం జగన్మోహన్ రెడ్డి సంజాయిషీ ఇవ్వాలని టీడీపీ పేర్కొంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..