Weather Alert: ఆ ప్రాంతాల్లో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. రానున్న 10రోజులు ఎండలు విపరీతంగా పెరగనున్నట్లు తెలిపింది.
Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రానున్న 10రోజులు కోస్తాంధ్ర సహా తెలంగాణలోని ఉత్తర, తూర్పు భాగాల్లో ఎండతీవ్రత బాగా పెరిగే అకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ప్రస్తుతం 35-36 డిగ్రీల మధ్య ఉన్న ఉష్ణోగ్రతలు.. త్వరలోనే 38-39 డిగ్రీలకు పెరుగుతాయని తెలిపింది. పలు చోట్ల 40కి పైగా ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వేసవి కాలంలో వడదెబ్బ తగలడం, డీహైడ్రేషన్ కు గురవ్వడం లాంటి సమస్యలు వస్తాయి. ఎండ కాలంలో వీలైనంత వరకు ఇంటిపట్టునే ఉండటం మంచిది. ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఉదయం 10 గంటలలోపే పూర్తి చేసుకోవాలి. లేదా సాయంత్రం ఆరు దాటిన తర్వాత బయటకు వెళ్లడం మంచిది. ఎండ కాలంలో నీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదు. ఏదైనా ఇబ్బందులు తల్తెతితే డాక్టర్ ను సంప్రదించాలి. వేసవిలో మజ్జిగ, బార్లీ, కొబ్బరి నీరు తీసుకోవడం మంచిది.
Also Read: Hyderabad Blast: హైదరాబాద్ శివారులో పేలుడు.. మహిళ మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి