Woman Chops Off Man gentials: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తన తల్లితో వివాహేతర సంబంధాన్ని సహించని ఓ యువతి అతని మర్మాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో అతను ఆసుపత్రిపాలయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆ యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... బాపట్ల జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి ఉపాధి కోసం రెండేళ్ల క్రితం తెనాలి వచ్చాడు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో ఉంటూ కూలీ నాలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక ఐతానగర్‌కి చెందిన మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి వివాహేతర సంబంధాన్ని ఆ మహిళ కుమార్తె సహించలేకపోయింది.


సోమవారం (మే 2) రాత్రి రామచంద్రారెడ్డి, ఆ మహిళ కలిసి మద్యం సేవించారు. ఆ మహిళ ఇంటి టెర్రస్‌ పైనే ఇద్దరూ నిద్రించారు. ఇదే అదనుగా భావించిన ఆ మహిళ కుమార్తె ప్రియుడితో కలిసి అక్కడికి వెళ్లి రామచంద్రారెడ్డితో గొడవపడింది. ఈ క్రమంలో బ్లేడుతో అతని మర్మాంగాలు కోసేసింది. రామచంద్రారెడ్డి గట్టిగా కేకలు పెట్టడంతో స్థానికులు అతన్ని తెనాలి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై తెనాలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.  


Also Read: This Week Tollywood Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న కొత్త సినిమాలివే...


Also Read: Sai Pallavi Marriage: సినిమాలు చేయకపోతే.. పెళ్లి చేసేస్తారా! ఆ వార్తలు ఎంత భాదిస్తాయో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook