Sai Pallavi Marriage: సినిమాలు చేయకపోతే.. పెళ్లి చేసేస్తారా! ఆ వార్తలు ఎంత బాధిస్తాయో తెలుసా?

Sai Pallavi Fans fires On Rumours About Her Marriage. సాయి పల్లవి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నదని, అందుకే సినిమాలను ఒప్పుకోవడం లేదని కొందరు పుకార్లు పుట్టించేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 11:31 AM IST
  • తెలుగులో కొత్త సినిమా ఒప్పుకోలేదు
  • సినిమాలు చేయకపోతే.. పెళ్లి చేసేస్తారా
  • ఆ వార్తలు ఎంత భాదిస్తాయో తెలుసా?
Sai Pallavi Marriage: సినిమాలు చేయకపోతే.. పెళ్లి చేసేస్తారా! ఆ వార్తలు ఎంత బాధిస్తాయో తెలుసా?

Sai Pallavi Fans slams Netizens over her Marriage Rumours: 'నేచురల్‌ బ్యూటీ' సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంబీబీఎస్ చదువుతుండగానే.. 'ప్రేమమ్' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మలార్ పాత్రలో అందరిని ఆకట్టుకున్నారు. ఆ సినిమా భారీ హిట్ కొట్టడంతో వరుస అవకాశాలు వచ్చాయి. 'ఫిదా' సినిమాతో తెలుగులో కూడా మంచి హిట్ అందుకుని స్టార్ అయ్యారు. ఆపై ఎంసీఏ, పడిపడిలేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలతో సత్తాచాటారు. 

గతేడాది చివరలో 'శ్యామ్ సింగరాయ్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నసాయి పల్లవి అప్పటినుంచి తెలుగులో కొత్త సినిమాను ఒప్పుకోలేదు. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో 'విరాటపర్వం' సినిమా మాత్రమే ఉంది. రానా హీరోగా నటించిన ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తి చేసుకుంది. విరాటపర్వం విడుదల కోసం ఆమె వెయిట్ చేస్తున్నారు. ఇన్నిరోజులు అయినా తన తదుపరి ప్రాజెక్ట్ ఏంటి అనేది ప్రకటించలేదు. దీంతో సాయి పల్లవి సినిమాలు దూరంగా ఉండడానికి కారణం ఏంటి అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. 

కొందరు అయితే సాయి పల్లవి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నదని, అందుకే సినిమాలను ఒప్పుకోవడం లేదని పుకార్లు పుట్టించేశారు. దీంతో సాయి పల్లవి ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'సినిమాలు చేయకపోతే.. పెళ్లి చేసేస్తారా?' అంటూ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి పుకార్లు సాయి పల్లవి కుటుంబాన్ని ఎంత బాధిస్తాయో తెలుసా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పల్లవి సన్నిహితులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, స్క్రిప్ట్ విషయంలో సాయి పల్లవి పక్కాగా ఉండాలి అనుకుంటోందని అంటున్నారు. 

సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉండడానికి కారణం మంచి కథ దొరక్కపోవడమే అని సమాచారం తెలుస్తోంది. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు తప్ప.. గ్లామర్ షోకు మాత్రమే పరిమితం అయ్యే క్యారెక్టర్ చేయనని గతంలోనే ఈ అమ్మడు తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. కథల ఎంపికలో సాయి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. త్వరలోనే ప్ మంచి పాత్రతో సాయి పల్లవి ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఏదిఏమైనా పెళ్లి వార్తలపై సాయి పల్లవి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. 

Also Read: Weather Update: మరో నాలుగు రోజులపాటు తస్మాత్ జాగ్రత్త: వాతావరణ శాఖ..!

Also Read: CM Jagan Ramadan Wishes: ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ పండగ శుభాకాంక్షలు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News