This Week Tollywood Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న కొత్త సినిమాలివే...

Telugu Movies Releasing This Week: బాక్సాఫీస్ వద్ద ఈ వారం కొత్త సినిమాల సందడి షురూ కానుంది. ఈ వారంలో మొత్తం 3 తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. అందులో రెండు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు కాగా మరొకటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, ఆచార్య వంటి పెద్ద సినిమాలు ఇంకా ఉండగానే ఈ సినిమాలు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 

  • May 03, 2022, 09:46 AM IST
1 /4

జయమ్మ పంచాయితీ : ప్రముఖ స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'జయమ్మ పంచాయితీ.' గ్రామీణ కుటుంబ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయమ్మ ఓ సమస్య విషయంలో ఊరి పెద్దలను ఆశ్రయించి పంచాయితీ పెట్టడమనే లైన్ చుట్టూ సినిమా కథ నడవనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. సినిమాలో దేవీ ప్రసాద్, దినేశ్, శాలినీ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.

2 /4

భళా తందనాన : శ్రీ విష్ణు-కేథరిన్ హీరో హీరోయిన్లుగా చైతన్య దంతలూరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం 'భళా తందనాన'. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. మే 6న ఈ సినిమా విడుదల కానుంది. సోమవారం (ఏప్రిల్ 2) విడుదలైన భళా తందనాన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

3 /4

అశోక వనంలో అర్జున కల్యాణం : విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన 'అశోక వనంలో అర్జున కల్యాణం' చిత్రం ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్వీసీసీ నిర్మాణ సంస్థలో బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఈ సినిమా రానుంది. రుక్సర్ దిల్లాన్ ఇందులో హీరోయిన్. తెలంగాణ అబ్బాయికి, ఆంధ్రా అమ్మాయికి పెళ్లి అనే కాన్సెప్టుతో  ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.  

4 /4

వచ్చే వారం సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' ఈ నెలలో రిలీజ్ కానున్న బిగ్ సినిమాగా చెప్పొచ్చు. వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రల్లో మణిశర్మ సంగీతంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం (మే 2) రిలీజ్ అయిన ట్రైలర్‌ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.