ఏపీ టెట్ వాయిదా వేయాల్సిందే: విద్యార్థుల డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తులను తీసుకొనే గడువు ముగిసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తులను తీసుకొనే గడువు ముగిసింది. దాదాపు 4,46,833 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే తెలిపిన షెడ్యూల్ ప్రకారంగా ఫిబ్రవరి 5వ తేది నుండి 15వ తేది వరకూ ఆన్‌లైన్ ద్వారా ఈ పరీక్షను, పరీక్షా కేంద్రాల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ మధ్యకాలంలోనే సిలబస్‌లో స్వల్ప మార్పులు చేయడంతో పాటు భాషా పండితుల కోసం పేపర్ 3 ని పెడుతున్నామని విద్యాశాఖ తెలపడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో పలువురు ఈ పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. ఆఖరి నిమిషంలో సిలబస్ మార్పులు చేయడం వల్ల చదువుకొనేందుకు సమయం చాలడం లేదని.. పరీక్షను వాయిదా వేసే విషయంలో పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ఇప్పటికే టైమ్ టేబుల్ విడుదల చేయాల్సి ఉండగా.. ఇంకా శాఖ విడుదల చేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.