తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ గడువు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ రోజు 3 గంటలకు దాఖలైన నామినేషన్లనే అధికారులు స్వీకరించారు. ఈ నెల 18వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా సెలవులు పోగా 4 రోజులే స్వీకరణ జరిగింది. 21న హోలీ పర్వదినం కారణంగా.. 23, 24 సెలవులు రావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. దీంతో చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
దశల వారీగా అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తున్న కొన్ని ప్రధాన పార్టీలు చివరి సమయంలో తమ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో పార్టీ నుంచి బీఫారం పొందిన అభ్యర్ధులు నామినేషన్ వేసేందుకు తహసీల్దార్ కార్యాలయంలో క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చివరి రోజున భారీ స్థాయిలో నామినేషన్లు వచ్చాయి. వీటిలో పార్టీల అభ్యర్థుల కంటే స్వతంత్ర్య అభ్యర్థుల నామినేషన్లే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
నామినేషన్లకు దాఖలు ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో రేపు ( మార్చి 26వ తేదీ ) నామినేషన్లను అధికారులు పరిశీలించి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 28న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు.ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించనున్నారు.నేషన్లు వేయనున్నారు.