బ్రిటీషర్ల పుల్లరిని ఎదిరించిన తెలుగోడు..!
పుల్లరి.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా. మన భారతదేశంలో ఒకప్పుడు పశువులకాపర్లను, రైతులను బ్రిటీషు వారు పెట్టిన క్షోభ అంతా ఇంతా కాదు. ఎవరైనా జనులు తమ వద్ద ఎలాంటి పశువున్నా... దానికి శిస్తు కట్టాల్సిందే.
పుల్లరి.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా. మన భారతదేశంలో ఒకప్పుడు పశువులకాపర్లను, రైతులను బ్రిటీషు వారు పెట్టిన క్షోభ అంతా ఇంతా కాదు. ఎవరైనా జనులు తమ వద్ద ఎలాంటి పశువున్నా... దానికి శిస్తు కట్టాల్సిందే. ఆ శిస్తుకే పుల్లరి అని పేరు పెట్టారు. ఈ విధానాన్ని తొలిసారిగా ఎదిరించిన వ్యక్తి ఓ తెలుగువాడు కావడం విశేషం. ఆయనే కన్నెగంటి హనుమంతు.
గుంటూరు జిల్లా మించాలపాడు గ్రామంలో జన్మించిన కన్నెగంటి హనుమంతు బ్రిటీషు వారి నిరంకుశ పాలన వల్ల సామాన్యులు అనుభవిస్తున్న బాధలను చూసి రగిలిపోయి పోరుబాట పట్టాడు. వారి సుంకం చెల్లించేది లేదని.. తెగేసి చెప్పాడు. పలనాటి సీమలో తెల్లవారి ఆగడాలకు ఎదురు నిలిచాడు. ప్రజలందరితో కలసి పుల్లరి సత్యాగ్రహం చేశాడు. అయితే అప్పటి గుంటూరు జిల్లా కలెక్టరు రూథర్ ఫోర్డు ఆధ్వర్యంలో ఈ సత్యాగ్రహాన్ని అణచివేశారు.సామాన్యులను తీసుకెళ్లి జైళ్లలో పెట్టారు.
పుల్లరి కడితేనే అరెస్టు చేసిన వారిని విడిచిపెడతామని బ్రిటీష్ ప్రభుత్వం తెలిపింది. అలాంటి సందర్భంలో సుంకం చెల్లించలేని వారందరి తరఫున తాను చెల్లిస్తానని ముందుకొచ్చాడు కన్నెగంటి హనుమంతు. అయితే శాంతియుతంగా ఉద్యమం చేయడానికి సిద్ధమైన హనుమంతుపై బ్రిటీష్ సేనలు విరుచుకుపడ్డాయి. ఆయనపై దాడి చేసి 24 తూటాలు ఆయన గుండెల్లో దింపాయి. హనుమంతు నేలకొరిగాడు.
అయినా పుల్లరి ఉద్యమం ఆగలేదు. కొనసాగుతూనే ఉంది. కన్నెగంటి హనుమంతు ప్రేరణతో అదే ప్రాంతంలో ఎందరో దేశభక్తులు తయారయ్యారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. గుర్రం జాషువా లాంటి కవులు సైతం హనుమంతు ధైర్యాన్ని కీర్తించారు. మిణుగురులు లేచె బెడదవు..శౌర్యాగ్నిశిఖలు మాంచాలపురిన్.. హనుమంతుడన వీరుడు..తెల్ల దొరల నేదిరించెన్ అని హనుమంతు గురించి పద్యాలు రాశారు. గుంటూరు జిల్లాకి కన్నెగంటి హనుమంతు పేరు పెట్టాలన్న డిమాండ్ ఎన్నో సంవత్సరాల నుండి ఉంది