Fact Check: అన్న ప్రసాదంలో జెర్రీ వార్త పూర్తిగా అవాస్తవం.. ఫేక్ న్యూస్ నమ్మవద్దంటూ టిటిడి విజ్ఞప్తి
TTD: తిరుమల కొండపైన అన్న ప్రసాదంలో జెర్రి పడిందనే వార్తలపై టీటీడీ వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. భక్తులు ఎవరూ కూడా దీనిపైన విచారణ చెందవద్దని ప్రకటించింది.
TTD Annaprasadam: బ్రహ్మోత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం ఖ్యాతిని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. అన్న ప్రసాదంలో జెర్రి కీటకం వచ్చిందని వార్తలను ఖండిస్తూ.. ఇది పూర్తిగా అవాస్తవమని.. అన్న ప్రసాదంలో జర్నీ కనబడిందని భక్తుడు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ టీటీడీ అధికారులు ఒక ప్రకటన చేశారు .
మొత్తం ఘటనపై ఒక వివరణ ఇస్తూ.. తిరుమలలోని మాధవ నిలయంలో అన్నప్రసాదం తిన్న సమయంలో అందులో ఒక జర్రి కనిపించిందని భక్తుడు ఆరోపణలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన టీటీడీ అధికారులు.. అసలు నిజం ఏమిటన్న దానిపై ఆరా తీశారు. దీనిలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా అన్న ప్రసాదంలో చూపించిన జర్రి అంత వేడిలోనూ ఎలా బతికి ఉందని.. ఒకవేళ పెరుగన్నం కలిపినా.. కానీ ముందుగా అన్నాన్ని ఉడకబెడతారని అంత వేడిలో జర్రి చెక్కుచెదరకుండా ఉండే అవకాశం లేదని ఖండించారు.
బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్న ఈ సందర్భంలో.. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఫేక్ మెసేజ్లను నమ్మవద్దని ఈ సందర్భంగా టిటిడి భక్తులకు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు ఎవరైతే భక్తుడు ప్రసాదంలో జర్రి వచ్చిందని విజ్ఞప్తి చేశాడో.. అది పూర్తిగా అవాస్తవమని దీనిపైన సమగ్ర దర్యాప్తు నిర్వహించిన తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే భక్తులు ఎవరు కూడా కొంతమంది శక్తులు చేస్తున్న ప్రచారానికి లోను కాకూడదని టీటీడీ అందించే సమాచారం పైన మాత్రమే ఆధారపడి నిజానిజాలు తెలుసుకోవాలని.. ఈ సందర్భంగా టిటిడి అధికారులు సోషల్ మీడియా వేదికగా సూచించారు.
Also Read: Bathukamma 2024: 5వ రోజు అట్ల బతుకమ్మ.. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా?
ఇదిలా ఉంటే ఇప్పటికే తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయని.. దీంతో క్వాలిటీ లేని నాణ్యత లోపించిన నెయ్యిని లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించినట్లు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభా వేదికగా వైయస్సార్సీపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి తిరుమలలో లడ్డు కేంద్రంగా కలకలం రేగింది. దీనిపై వైయస్సార్సీపి ఖండన ఇచ్చింది. అంతేకాదు కోర్ట్ న్యాయస్థానం వెళ్లి తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది.
అయితే ప్రస్తుతం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవం ప్రత్యేక సెల్ నేడు టిటిడి ఈవో శ్యామలరావు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన సందర్భంగా తీసుకున్న ఏర్పాట్లకు ఈవో తమ సిబ్బందిని అభినందించారు. ముఖ్యంగా ఇదే స్ఫూర్తితో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన సిబ్బందిని కోరారు. అలాగే తినుబండారాలను పరిశుభ్రంగా ఉంచడం టాక్సీల అదనపు వసూళ్లు కొండపైన పరిశుభ్రత వంటి విషయాల పైన కూడా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు అని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు.
Also Read: Tirumala Laddu Controversy : తిరుమల లడ్డుపై సుప్రీం స్పెషల్ సిట్, టెన్షన్ లో ఏపీ రాజకీయ పార్టీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter