Bathukamma 2024: 5వ రోజు అట్ల బతుకమ్మ.. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా?

Bathukamma 5 Th Day 2024: బతుకమ్మ పండుగ ఆశ్వీయుజ అమావాస్యతో ప్రారంభం అవుతుంది. ఇది పదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. దీన్ని పెద్దబతుకమ్మ అని కూడా పిలుస్తారు. అయితే, బతుకమ్మ 5వ రోజు అట్ల బతుకమ్మ అని పిలుస్తారు ఎందుకో తెలుసుకుందాం.
 

1 /5

తెలంగాణలో ఎంతో వేడుకగా జరుపుకొనే బతుకమ్మ పండుగ ఆశ్వీయుజ అమావాస్య కు ముందుగానే బొడ్డెమ్మతో ప్రారంభం అవుతంది. ఆ తర్వాత రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఊరువాడా అంతా కలిసి సాయంత్రం వేళ ఒక్కదగ్గరకు చేరి బతుకమ్మను ఆడుకుంటారు.  

2 /5

ఈ వేడుకను 9 రోజులపాటు నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ ఐదవ రోజు అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు వాయనంగా పిండితో తయారు చేసిన అట్లను ఇచ్చి పుచ్చుకునే ఆచారం ఉంది. అందుకే అట్ల బతుకమ్మ అని పేరు వచ్చింది.  

3 /5

9 రోజులపాటు నవ రాత్రుల్లో కొనసాగే ఈ బతుకమ్మ వేడుక తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ప్రసాదంగా కూడా 9 రకాలు తయారు చేస్తారు. నందివర్ధనం, తంగేడు పూలు, గునుగుపూలు తెచ్చి గోపురం ఆకారంలో  పూజిస్తారు.  

4 /5

బతుకమ్మలో వాడే ఈ పూలలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ కాలంలో వానలు బాగా పడతాయి. ఆశ్వీయుజ అమావాస్యతో మొదలయ్యే సద్దుల బతుకమ్మను పెద్ద పెద్ద బతుకమ్మలుగా తయారు చేసి ఆడపడచులంతా కలసి ఆడుకుంటారు.

5 /5

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x