Tirumala Laddu Controversy :తిరుమల లడ్డుపై సుప్రీం స్పెషల్ సిట్, టెన్షన్ లో ఏపీ రాజకీయ పార్టీలు

Tirumala Laddu Controversy :  తిరుమల లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాలను ఏ మలుపుతిప్పబోతుంది..?  సుప్రీం డైరెక్షన్ లో సిట్ దర్యాప్తు ఎలా కొనసాగనుంది..? సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు రేపబోతుంది..? అసలు సుప్రీం తీర్పును పైకి సమర్థిస్తున్నా  ఏపీ పొలిటికల్ పార్టీలు ఎందుకు గుబులు చెందుతున్నాయి..? పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నా ..లోలోన ఎందుకు దిగాలు చెందుతున్నాయి..?

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Oct 5, 2024, 08:52 PM IST
Tirumala Laddu Controversy :తిరుమల లడ్డుపై సుప్రీం స్పెషల్ సిట్, టెన్షన్ లో ఏపీ రాజకీయ పార్టీలు

Tirumala Laddu Controversy : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది.ఏపీ రాజకీయాల్లో  ఈ లడ్డు వ్యవహారం  పెను ప్రకంపనుల సృష్టించింది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అన్నింటికి మించి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎంతో పవిత్రంగా భావించే ఆ ఏడుకొండల వాడి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి పవిత్రతను దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఇది ఇలా ఉండగానే అసలు లడ్డు కల్తీ జరిగిందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఈ లడ్డు వ్యవహారం అంతా కూడా రాజకీయ దురుద్దేశంతో సాగుతుందా అన్న సందేహాలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సిట్ విచారణను ఆదేశించింది.

ఒక వైపు సిట్ విచారణకు సిద్దమవుతున్న సమయంలోనే  బీజేపీ ఎంపీ సుబ్రమణ్వ స్వామి, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమల లడ్డు అంశంలో సుప్రీంను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని పిటిషన్ దాఖలు చేశారు. సుబ్రమణ్య స్వామి,వైవి సుబ్బారెడ్డిల పిటిషన్ లను స్వీకరించిన అత్యున్నత న్యాయం స్థానం లడ్డు వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డు వ్యవహారాన్ని రాజకీయం చేయడంపై మండిపడింది. చివరకు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతారా అని ఘాటుగా ప్రశ్నించిన సుప్రీం..ఈ వ్యవహారంలో 5 గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విచారణ అంతా కూడా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుందని తీర్పు నిచ్చింది. సుప్రీం తీర్పుతు తిరుమల లడ్డు వ్యవహారంలో ఊహించని మలుపు తిరిగింది.

ఐతే సుప్రీం తీర్పును దేశ వ్యాప్తంగా అన్ని పక్షాలు స్వాగతిస్తున్నాయి. ఏపీలోని రాజకీయ పార్టీలు సైతం సుప్రీం తీర్పును స్వాగతించాయి. ఇంత వరకు బాగానే ఉన్నా సుప్రీం తీర్పుపై లోలోన పార్టీలు ఆందోళన చెందుతున్నాయట. నిన్న మొన్నటి వరకు తిరుమల లడ్డుపై ఎన్నెన్నో మాట్లాడాం..ఇప్పుడు సుప్రీం ఏర్పాటు చేసిన ప్రత్యేక సిట్ విచారణ ఎలా జరుపుతుందో అన్న ఆందోళనలో ఉన్నాయట.  రాజకీయ పార్టీల నేతలు పైకి గంభీరంగా కనపడుతున్నా లోలోన తెగ టెన్షన్ పడుతున్నాయట. లడ్డు కల్తీ జరగలేదని ప్రతిపక్షం, కల్తీ జరిగిందని అధికార పక్షం ఇప్పుడు వీరిలో ఎవరి వాదనలో నిజమేంటో సిట్ తేల్చనుంది. సిట్ విచారణలో కల్తీ జరిగిందా లేదా అన్నది స్పష్టం అవుతుంది కాబట్టి తమకు రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయో అన్న ఆందోళనలో పార్టీలు ఉన్నాయట.

ఒక వేళ తిరుమల లడ్డు కల్తీ జరిగిందని విచారణలో తేలితే రాజకీయంగా తమకు తీవ్ర ఇబ్బందులు తప్పవని వైసీపీ ఆందోళన చెందుతుంది. మరోవైపు టీడీపీ కూడా ఇదే రకంగా టెన్షన్ పడుతుంది. తిరుమల లడ్డు కల్తీ జరగలేదని స్పష్టం అయితే అప్పుడు మనకు రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయో అన్న ఆందోళనలో ఉందంట. ఇలా రెండు పార్టీలకు కూడా ఈ తిరుమల లడ్డు అంశం నిద్రలేకుండా చేస్తుందంట. మరోవైపు సుప్రీం తీర్పును సామాన్య ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదని ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన అంశం కాబట్టి ఇందులో నిజాలు నిగ్గు తేలాలని అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఎవరు తప్పుచేసినా వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.  ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడితో పెట్టుకున్నవారికి తగిన శాస్తి తప్పదు అంటూ భక్తులు హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి తిరుమల లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయ పార్టీలను తెగ టెన్షన్ పెడుతుందంట. ప్రత్యేక సిట్ విచారణలో ఏం తేలుతుందో అని తెగ ఆందోళన చెందుతున్నారట. 

Read more: RGV :కొండా సురేఖకు మరిచిపోలేని గుణపాఠం నేర్పాలి.. ? ఆర్జీవి సంచలన కామెంట్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News