రుణ మాఫీ కాకుంటే.. 1100 డయల్ చేయండి
.
కర్నూలు: అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అందేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబాబు అన్నారు. కర్నూలు జిల్లా తంగడంచలో ఎన్జీరంగా వర్శిటీ-వ్యవసాయశాఖ సంయుక్తంగా చేపట్టిన మోగా సీడ్ పార్కు నిర్మాణానికి ఏపీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మూడో విడత రుణమాఫీలో భాగంగా 36.72 లక్షల మంది రైతులకు రూ.3,600 కోట్ల చెక్కును అందించి పంపిణీకి శ్రీకారం చుట్టారు. రుణమాఫీ ప్రక్రియ సవ్వంగా జరిగేలా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం వెల్లడించారు. అర్హత ఉండి కూడా రుణ మాఫీ కాకుంటే 1100 డయల్ చేసి ఫిర్యాదు చేయాలని రైతులను కోరారు. కర్నూలులో పండించే సోనా బియ్యానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.