Summer Temperature: ఈ వేసవిలో తీవ్రంగా ఉండనున్న ఎండలు, వడగాల్పులతో అప్రమత్తం
Summer Temperature: శీతాకాలం ముగిసింది. వేసవి ప్రారంభమే వేడి రాజేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వేసవి చాలా హాట్‌గా ఉండబోతుందనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.
Summer Temperature: శీతాకాలం ముగిసింది. వేసవి ప్రారంభమే వేడి రాజేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వేసవి చాలా హాట్‌గా ఉండబోతుందనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.
దక్షిణాదిలో వేసవి అంటే చాలు తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాలు భగ్గున మండుతుంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వేసవి ప్రతిసారీ చాలా హాట్‌గా ఉంటుంది. సెగలు రేపే వడగాల్పులు భయం గొలుపుతుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్నా పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 37-38 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి వస్తున్న అప్‌డేట్ ఆందోళన కల్గిస్తోంది. ఈ వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండనున్నాయనేది వాతావరణ శాఖ సూచన.
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే 1-2 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాని సమాచారం. ఏప్రిల్-మే నెలల్లో ఈ ప్రాంతాల్లో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. ఆ సమయానికి పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరవచ్చనేది అంచనా. దీనికితోడు వడగాల్పులు తీవ్రత అధికంగా ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 35-36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చని అంచనా. రాయలసీమ, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 38 డిగ్రీల వరకూ నమోదవుతోంది. ఏప్రిల్, మే నాటికి 47-48 డిగ్రీలకు చేరవచ్చనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఏప్రిల్-మే నెలల్లో వడగాల్పులతో జాగ్రత్తగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
Also read: Kothapalli Subbarayudu: చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook