ప్రత్యేక హొదా ఇచ్చే వారే దేశ ప్రధాని అవుతారు - నారా లోకేష్
ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నలోకేష్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎన్నికల తర్వాత టీడీపీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని..కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి తమ మద్దతే కీలకం కానుందన్నారు. దేశ ప్రధానిని సైతం నిర్ణయించేంది చంద్రబాబేనని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీలు ఎవరు నెరవేరుస్తారో వారే దేశ ప్రధాని అవుతారని లకోష్ వ్యాఖ్యానించారు.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. అటు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఇదే తరహాలో ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు లోకేష్ కూడా ఇదే తరహా వ్యాఖ్యాలు చేయడం గమనార్హం