పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల కోసం చేస్తున్న ఏర్పాట్లలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. తెల్లవారితే సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే ( Pawan Kalyan birthday celebrations ) కావడంతో తమ అభిమాన నటుడు, నాయకుడి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని భావించిన ఆయన అభిమానులు ముగ్గురు ఊహించని విధంగా విద్యుదాఘాతానికి గురై చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. కుప్పం - పలమనేరు జాతీయ రహదారిపై 25 అడుగుల ఎత్తున్న బ్యానర్లను ఏర్పాటు చేసే క్రమంలో పైన ఉన్న విద్యుత్ తీగలకు ఆ బ్యానర్ తగలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. Also read : COVID-19: కరోనాతో తెలంగాణ మాజీ మంత్రి మృతి


ఈ ప్రమాదంలో ముగ్గురు అభిమానులు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తెల్లవారితే జనసేనాని బర్త్ డే వేడుకల్లో మునిగితేలాలని భావించిన పవన్ అభిమానులకు ( Pawan Kalyan fans ) ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. Also read : COVID-19 AP: ఏపీలో 4 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య