Tirumala Thieves | దొంగతనాలను నివారించడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దొంగలు కొత్త కొత్త విధానాలతో చోరీలకు పాల్పడుతున్నారు. దొంగల తెలివితేటలు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తిరుమలలో జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Diwali Special Lamp: ఎప్పుడూ ఆరిపోని దీపాన్ని తయారు చేశాడు..పూర్తి వివరాలు చదవండి


తిరుమలలో ( Tirumala ) ఒక బిచ్చగాళ్ల కుటుంబం కలిసి ఒక పక్కా ప్లానింగ్ తో చోరీకి పాల్పడింది. ఇటీవలే తిరుమల వెళ్లిన బెగ్గర్స్ ఫ్యామిలీ పట్టపగలే దొంతనం చేసినట్టు సీసీటీవిలో ( CCTV) రీకార్డు అయింది. ముగ్గురు పిల్లలతో కలిసి ముగ్గరు మహిళలు తిరుమలలోని లీలా మహల్ సెంటర్ వద్ద ఉణ్న లక్ష్మీ వెంకటేశ్వర స్టీల్ ఫాపులోకి ఎంటర్ అయ్యారు. తరువాత యాచించడం మొదటలుపెట్టారు.



Also Read | ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టనున్నారా?  నిజం తెలుసుకోండి!


ఈ క్రమంలో మహిళలతో పాటు వచ్చిన పిల్లలు షాపులోని టేబుల్ కింది దూరి డ్రా నుంచి డబ్బులను క్షణాల్లో మాయం ( Tirumala Thieves) చేశారు. ఈ డబ్బును తీస్తున్న సమయంలో మహిళలు షాపు యజమానికి డబ్బులు అడుగుతూ అతన్ని బిజీగా ఉంచారు. 


ఈ సీన్స్ మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఇదంతా అనుకోకుండా జరగలేదు అని పక్కా ప్లానింగ్ ప్రకారమే ఇది జరిగింది అని పోలీసులు ( Police ) భావిస్తున్నారు. అలిపిరి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.



Also Read | Diwali 2020 Gifts: దీపావళి ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నారా? వీటిని ట్రై చేయండి 


డబ్బులు దొంగలించే విధంగా పిల్లలకు సదరు మహిళలు ముందుగానే సిద్ధం చేసి ట్రైనింగ్ ఇచ్చినట్టు పక్కాగా తెలుస్తోంది. మొత్తంగా రూ.లక్షా 50 వేలను ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తోంది.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR