ఈ దీపావళి ( Diwali ) మనకు చాలా ఢిఫరెంట్. ఎందుకంటే ఒకవైపు కరోనా..మరోవైపు చైనా వస్తువులను వాడటం తగ్గించి స్వదేశీ వస్తువుల వినియోగం పెంచుకోవాలి అని భారతీయులంతా భావిస్తున్నారు. అందుకే ఈ సారి చైనా ( China ) లైట్లు మన మార్కెట్లో వెలగడం లేదు. కానీ దీపావళి అటే వెలుగుల పండగ కదా.. మరి అలా జిగేలుమని వెలిగేలా ఏం చేయాలి అనుకున్నాడు ఒక కుమ్మరి.. వెంటనే తన మనసులో వచ్చిన ఒక డిజైన్ ను ఇలా ప్రయత్నించి సాధించాడు.
Also Read | IRCTC New Booking Rules: IRCTC నుంచి టికెట్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ తెలుసుకోండి!
ఛత్తీస్‌గఢ్ ( Chattisgarh ) రాష్ట్రానికి చెందిన ఆశోక చక్రధారి కొత్తగా ప్రయత్నిస్తూ దీపావళి నాడు నిత్యం వెలిగే దీపాలను తయారుచేశాడు. అతను తయారు చేసిన దీపాలు ఇప్పడు సోషల్ మీడియాలో కూడా వెలుగుతున్నాయి. ట్రెడిషనల్ దీపాలకు ఇలా మోడ్రన్ లుక్ ఇచ్చి కొత్తదనం చూపించాడు. దీనికి అతను మ్యాజిక్ ల్యాంప్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఇది 24 గంటలూ వెలుగుతూనే ఉంటుంది.
ALSO READ| Google Maps: ఇంటర్నెట్ లేకున్నా గూగూల్ మ్యాప్స్ ఇలా వాడవచ్చు
ఇందులో ఒక భాగంలో నూనె పోయాల్సి ఉంటుంది. అది కింది భాగంలో ఉన్న ఉప్పు విభాగంలో చేరుతుంది. ఈ నూనె రోజంతో దీపాన్ని వెలిగిస్తుందట.ఈ రిజర్వాయర్ లో చాలా నూనె స్టోర్ అవుతుందట.దీంతో నిత్యం జిగేలు మని ప్రకాశిస్తూనే ఉంటుంది దీపం.
ALSO READ| Roses For Health: గులాబీ పూవుల వల్ల ఎన్ని లాభాలో, ఔషధ గుణాలు తెలుసుకోండి
ఇలాంటి దీపం తయారు చేయడానికి అశోక్ చక్రధారికి ఐడియా ఎలా వచ్చిందో తెలుసా ? ఒక యూట్యూబ్ ( YouTube ) వీడియో చూసి. అయితే వీడియో చూసినంత మాత్రాన రిజర్వాయర్ ఉన్న దీపాన్ని తయారు చేయడం అంత సులభంగా సాధ్యం కాలేదట. అయితే ఎన్నో ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు అశోక్. అతని ప్రయత్నాన్ని నెటిజెన్స్ ( Netizens ) తెగ మెచ్చుకుంటున్నారు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR