Tiktok lovers: టిక్‌టాక్‌లో పరిచయం.. ప్రేమ, పెళ్లి.. ఇంతలోనే ఆత్మహత్య
టిక్‌టాక్‌లో పరిచయమైన ఓ ప్రేమ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆత్మహత్యకు ( Couple suicide ) పాల్పడిన ఘటన బెల్లంకొండ మండలం మాచయపాలెం ఆర్ఆర్ సెంటర్‌లో జరిగింది.
గుంటూరు: టిక్‌టాక్‌లో పరిచయమైన ఓ ప్రేమ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆత్మహత్యకు ( Couple suicide ) పాల్పడిన ఘటన బెల్లంకొండ మండలం మాచయపాలెం ఆర్ఆర్ సెంటర్‌లో జరిగింది. యువతిని తిరుపతికి చెందిన శైలజగా (17) యువకుడిని మంగళగిరికి చెందిన పవన్ కుమార్‌గా (20) గుర్తించారు. టిక్ టాక్‌లో పరిచయమైన ఈ ఇద్దరూ 10 నెలలుగా ప్రేమించుకుంటున్నారు. గత నెలలో తిరుపతిలో పెళ్ళి చేసుకున్నారు. మాచయపాలెంలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఇంతలోనే ఉన్నట్టుండి ఇద్దరూ ఇలా ఒకే ఫ్యాన్‌కి ఉరేసుకుని కనిపించడం స్థానికంగా కలకలంరేపింది. Also read : Telangana Assembly session: అసెంబ్లీ సమావేశాల్లో చర్చకొచ్చే అంశాలు
కొత్త జంట ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు.. వారి గదిలో లభించిన సూసైడ్ నోట్‌ని ( Suicide note ) స్వాధీనం చేసుకున్నారు. యువతి తల్లిదండ్రులు చంపుతామని బెదిరిస్తున్నట్లు వారు ఆ లేఖలో పేర్కొన్నారు. హేమలత, రవీంద్ర, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తులే తమ చావుకు కారణంగా ఆ సూసైడ్ నోట్ ద్వారా వెల్లడించారు. ప్రేమ జంట ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న బెల్లంకొండ పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. Also read : Revanth Reddy: కేసీఆర్, జగన్‌లపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు