Revanth Reddy: కేసీఆర్, జగన్‌లపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై ( YS Jagan ) కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి ( Revanth Reddy ) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ నైజం ఏంటనేది క్రమక్రమంగా తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు.

Last Updated : Sep 3, 2020, 09:55 PM IST
  • సీఎం కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టిన రేవంత్ రెడ్డి.
  • తెలంగాణలో పరిస్థితులు మారాలంటే సీఎం కేసీఆర్‌ని గద్దె దించుడు ఒక్కటే మార్గం అని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. అందుకోసం తుది దశ పోరాటం జరగాల్సిన అవసరం ఉందని పిలుపు.
  • ఏపీ సీఎం వైఎస్ జగన్‌పైనా రేవంత్ సంచలన వ్యాఖ్యలు.
Revanth Reddy: కేసీఆర్, జగన్‌లపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై ( YS Jagan ) కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి ( Revanth Reddy ) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ నైజం ఏంటనేది క్రమక్రమంగా తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటానని చెప్పిన కేసీఆర్.. ఉద్యమకారులను అణిచివేసి పెట్టుబడిదారులకే టికెట్లు ఇచ్చారు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యమకారులను తరిమికొట్టిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు ( Minister Talasani Srinivas Yadav ) మంత్రి పదవి ఇచ్చారని.. ఆయన కొడుక్కి ఎంపీ టికెట్ ఇచ్చారని రేవంత్ ధ్వజమెత్తారు. ఉద్యమకారులను అణిచివేసిన కేసీఆర్.. అంతటితో ఆగకుండా ఆఖరికి ప్రతిపక్షాల హక్కులను సైతం హరిస్తున్నారని మండిపడ్డారు. Also read : SLPL schedule: 5 క్రికెట్ జట్లు.. 15 రోజుల టీ20 టోర్నమెంట్

తెలంగాణలో పవర్ ప్రాజెక్టులను ( Power projects in Telangana ) చంపే కుట్ర జరుగుతోందని.. పాత విద్యుత్ ప్రాజెక్టులను చంపి వాటి స్థానంలో కొత్తవి కట్టాలనే స్కెచ్ వేస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు ఇలాంటి సమస్యల నుంచి శాశ్వత విముక్తి కలగాలంటే కేసీఆర్‌ను గద్దె దించడం తప్ప మరో మార్గం లేదని.. అందుకోసం తుదిదశ పోరాటం జరగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ విషయంలో తనకు ఏ పదవి లేకపోయినా పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్‌ రెడ్డి స్పష్టంచేశారు. కోదండరామ్‌కు ( Kodandaram ) టీజేఎస్ లాంటి రాజకీయ పార్టీ సరిపోదని.. రాజకీయాలకు అతీతంగా టీజేఏసి లాంటి ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేయండి' అని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తిచేశారు. Also read : MLA Raja Singh: ఎమ్మెల్యే రాజా సింగ్ ఫేస్‌బుక్ ఖాతాపై నిషేధం

ఇదిలావుంటే, మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) గురించి మాట్లాడుతూ.. 'వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కొడుకు కూడా ఆయనలాగే ఉంటాడని ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడుకు ( Pothireddypadu ) వైఎస్ పొక్కపెడితే.. ఆయన కొడుకు జగన్ దాన్ని పెద్దగా చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ కృష్ణా బేసిన్ నుంచి తీసుకుంటున్నది కేవలం ఒక్క టీఎంసీ మాత్రమేనని.. కానీ ఏపీ మాత్రం 12 టీఎంసీలు తీసుకుపోతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. Also read : Telangana: కొత్తగా 2,817 కరోనా కేసులు

Trending News