Ap Govt cancels sit on Tirumala laddu issue: తిరుమల లడ్డు వివాదం దేశంలో తీవ్ర సంచలనంగా మారింది. కోట్లాది మంది శ్రీవారి భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డులో ఇటీవల జంతువుల కొవ్వు, చేపనూనెల వంటివి కలిపారంటూ  కూడా ఏకంగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. మన దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతే కాకుండా.. దీనిపై ఏపీలో టీడీపీ వర్సెస్ కూటమిలా మారింది. చంద్రబాబు సర్కారు దీనిపై స్పెషల్గా సిట్ ను సైతం ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ప్రాయిశ్చిత దీక్షను చేపట్టారు. ఈ నేపథ్యంలో లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్ లు దాఖలయ్యాయి. దీనిపై నిన్న (సోమవారం) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అంతేకాకుండా.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది.


లడ్డు వివాదంపై.. టీడీపీ ప్రభుత్వం, టీటీడీ  ఈవో చేసిన ప్రకటనలు మాత్రం భిన్నంగా ఉన్నాయని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డులో నిషేధిత కొవ్వు ఉపయోగించినట్లు ఖచ్చితనమైన ఆధారాలు ఉన్నాయా.. అంటూ సుప్రీంకోర్టు పలు ప్రశ్నలను సంధించింది. 


కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని ఎక్కడి నుంచి సేకరించారు..? ఆ నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్లు ప్రూఫ్ ఏంటని ప్రశ్నించారు..? నెయ్యిపై ఏమైన ల్యాబ్ రిపోర్టులు ఏమైన ఉన్నాయా.. టీటీడీ తిరస్కరించిన నెయ్యిల్లో అవశేషాలు ఉన్నాయా అంటూ ఫైర్ అయ్యింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మీద కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.


సిట్ విచారణ జరగకుండానే సీఎం ప్రకటన ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం సరిగ్గా విచారణ జరపగలదో లేదో అనే అనుమానం కూడా సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తాజాగా, ఏపీలో లడ్డు వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. సిట్ దర్యాప్తు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.


Read more: Tirumala Laddu Row: పవన్ అసలైన సెక్యులర్.. లడ్డు వివాదం వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు..


ఈ క్రమంలో.. లడ్డు వివాదంపై సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారక తిరుమల రావు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు చేసిన సూచన మేరకుఈ  నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు బాస్ వెల్లడించారు. తదుపరి సుప్రీంకోర్టు విచారణకు అనుగుణంగా..  ముందుకు వెళ్లామని కూడా డీజీపీ ప్రకటన చేశారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.