Jagan hot comments on chadrababu naidu:  దేవుడి దగ్గరకు వెళ్తానంటే కూడా పర్మిషన్ లేదని నోటీసులు ఇచ్చారని జగన్ అన్నారు. గుడికి పోయేందుకు కూడా.. పర్మిషన్ తీసుకొవాలా అంటూ మండిపడ్డారు. శ్రీవారి దర్శనానికి వెళ్తున్నానంటూ అడ్డుకొవడమేంటని కూడా చంద్రబాబుపై .. జగన మండిపడ్డారు. చంద్రబాబు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని జగన్ అన్నారు. చంద్రబాబు చెప్పినవన్ని అసత్యాలు అని కన్పిస్తున్నాయన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వందరోజుల పాలన టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు.. లడ్డు గొడవ పైకి తెచ్చారు. లడ్డులో మోసం జరిగిందని దాన్ని డైవర్ట్ చేసేందుకు కొత్తగా డిక్లరేషన్ ను పైకి తీసుకొచ్చారని కూడా జగన్ అన్నారు. చంద్రబాబు లడ్డుపైన జరగని దాన్ని జరిగినట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీన్ని ఆధారాలతో సహా చూపిస్తామని జగన్ అన్నారు.  శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఏకంగా ముఖ్యమంత్రి ఇలా చేయడం ఎక్కడైన ఉందా..అని మండిపడ్డారు.


అదే విధంగా జగన్  పర్యటనలో పాల్గొంటే కేసులు పెడుతామంటూ కూడా కొంత మంది బెదిరించారన్నారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి నెయ్యికి టెండర్ లు వేస్తారని జగన్ అన్నారు. తిరుమల లడ్డుకు ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిదశాబ్దాలుగా ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. టీటీడీలో తప్పులు జరిగేందుకు ఆస్కారం లేనివిధంగా వ్యవస్థలు ఉన్నాయని మాజీ సీఎంజగన్ అన్నారు. 


కల్తీ నెయ్యి వాడలేదని జులైలో ఈవో స్పష్టం చేశారు.  రెండు నెలలు తర్వాత చంద్రబాబు ఎనిమల్ ఫ్యాట్ ఉందని ప్రకటిస్తాడు. రిజక్ట్ అయిన శాంపిల్స్ లను వెనక్కి పంపించినట్లు తెలిపారు. అనుమానం వస్తే.. మైసూర్ కు టెస్టుల కోసం పంపిస్తుంటారు. తిరుమల నెయ్యిని మొదటి సారి టెస్టుల కోసం గుజరాత్ కు పంపించారని జగన్ అన్నారు.


సెప్టెంబర్ 18 చంద్రబాబు మాట్లాడితే..సెప్టెంబర్ 19 టీటీడీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్టులు బైటపెట్టారన్నారు. 20  న కల్తీనెయ్యి వాడలేదని ఈవో చెప్పారని అన్నారు. చంద్రబాబు మరల 22 న ప్రెస్ మీట్ పెట్టి వాడని నెయ్యిని వాడినట్లు ,చెప్పడం .. కేవలం రాజకీయంగా లబ్ది కోసమే డ్రామాలు చేస్తున్నాడని , స్వామి వారి ప్రసాదం విశిష్టతను,  శ్రీవారి పేరు ప్రఖ్యాదులను తప్పించే పనులు చంద్రబాబు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. 


Read more: Tirumala: వైఎస్‌ జగన్‌ తిరుమల దర్శనం.. డిక్లరేషన్‌ కోరనున్న దేవస్థానం..? గతంలో డిక్లరేషన్‌ ఇచ్చిన ప్రముఖులు వీరే..!



భూమన కరుణాకర్ రెడ్డి..


మరోవైపు కొంత మంది కావాలని భౌతిక దాడులు దిగేందుకు సిద్దంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని కూడా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. భక్తులు ముసుగులోకి జగన్ పై దాడికి పాల్పడే కార్యక్రమానికి ప్లాన్ వేసినట్లు తమకు తెలిసిందని భూమన అన్నారు. దీంతో ఇది ఒక్కసారిగా రాజకీయంగా రచ్చగా మారింది. ఆరుగురిలో కలిసి జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకొవాలని అనుకున్నారని భూమన అన్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.