Tirumala Laddu Demand: తిరుమల లడ్డూ కి పెరిగిన గిరాకీ.. పోటెత్తిన భక్తులు..!
Tirumala Laddu Update: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందని సెప్టెంబర్ 18 తేదీన ఒక వార్త తెరపైకి వచ్చింది. దీంతో లడ్డు విక్రయించే వారి సంఖ్య తగ్గుతుంది అని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా లక్షల్లో లడ్డూలు అమ్ముడుపోతూ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు..
Tirupati Laddu: అసలే ఒకవైపు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు నాయకులు డిబేట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎలా అయినా అనండి.. మాకు మాత్రం తిరుమల లడ్డూయే కావాలి అంటూ భక్తులు పోటెత్తడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా తిరుమల లడ్డుకు మించిన ప్రసాదం మరొకటి ఉండదేమో..ఆ రుచి.. ఆ వాసన. నోట్లో వేసుకోగానే కరిగిపోయే తీరు. దీనికి తోడు స్వామి పైన అపారమైన భక్తి.. ఇవన్నీ కలిసి తిరుమల లడ్డూ కి , మనకు విడదీయరాని బంధాన్ని ఏర్పరచాయి.
ఇదిలా ఉండగా స్వామివారి లడ్డూ లో పంది మాంసం కలిసింది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరొకవైపు స్వామివారి లడ్డూ కి ఒక్కసారిగా డిమాండ్ పెరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏ రోజు ఎన్ని లడ్డూలను భక్తులు కొంటున్నారో లెక్కలతో సహా వైరల్ అవుతున్నాయి.
నిజానికి ఈ లడ్డూ వివాదం సెప్టెంబర్ 18వ తేదీన మొదలైంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది. దీంతో 18వ తేదీ తర్వాత లడ్డూల అమ్మకం తగ్గిపోతుందని, భక్తులు ఎవరు లడ్డూలు కొనుక్కోరని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ మొత్తం విరుద్ధంగా జరిగింది. 19వ తేదీ రోజు 3.59 లక్షల లడ్డూలు అమ్ముడుపోగా.. అలాగే 20వ తేదీ 3.16 లక్షల లడ్డూల విక్రయాలు జరిగాయి. ఇక మొన్న 21వ తేదీ రోజున 3.66 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. ఇకపోతే ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు.
ఇకపోతే లడ్డూలను అంత పవిత్రంగా భావిస్తారు కాబట్టే ఇప్పుడు కలుషితమైన నెయ్యిని వాడారు అనే వాదన వినిపిస్తున్నా ఈ విషయాన్ని మాత్రం భక్తులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఈ వివాదానికి తెర తీసిన సీఎం చంద్రబాబే.. మరో మాట కూడా అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డు యొక్క క్వాలిటీ పెంచామని, పైగా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడుతున్నామని తెలిపారు. అందుకే ఇప్పుడు మంచి లడ్డూలనే అమ్ముతున్నారులే అనుకుంటూ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు.
ఇకపోతే దీనికి ఒక సైకాలజికల్ కారణం కూడా ఉంది.. ప్రస్తుతం మూడు రోజుల నుంచి టీవీల్లో , మొబైల్స్ లో, ఇంటర్నెట్ లో ఇలా ఎక్కడ చూసినా సరే ఈ లడ్డులే కనిపిస్తున్నాయి. దాంతో పదే పదే చూడడం, చూసేసరికి నోట్లో నీరు కూడా ఊరుతున్నాయి. అందుకే వీటిని తినాలనే కోరిక ప్రజల్లో పెరుగుతున్న నేపథ్యంలో వీటికి బాగా డిమాండ్ పెరిగిందనే వార్త వినిపిస్తోంది. ఏది ఏమైనా వాదన ఏదైనా లడ్డు మాత్రం కావాలంటూ భక్తులు పోటెత్తారు.
Also Read: Rhea singha: గుజరాత్ భామను వరించిన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.