Tirumala Laddu: రేపటితో పవన్ కళ్యాణ్ దీక్ష పూర్తి, ఇవాళ్టి నుంచి 3 రోజులు తిరుమల పర్యటన ఇలా
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష రేపటితో పూర్తి కానుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుంచి మూడు రోజులు తిరుమల తిరుపతిలో పర్యటించనున్నారు. ఆ పర్యటన షెడ్యూల్ ఇలా ఉంటుంది.
Tirumala Laddu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమల చేరుకోనున్నారు. రేపు స్వామి సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్ష ముగించనున్నారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందనే ఆరోపణల నేపధ్యంలో పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష రేపటితో ముగియనుంది. ఈ నేపధ్యంలో ఆయన మూడు రోజులు తిరుమల, తిరుపతిలో పర్యటించనున్నారు. రేపు తిరుమలలో స్వామి వారి సన్నిధిలో దీక్ష విరమించనున్నారు. ఎల్లుండి తిరుపతిలో వారాహి సభలో ప్రసంగిస్తారు. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. మూడు రోజుల తిరుమల షెడ్యూల్ ఇలా ఉంది..
ఇవాళ మద్యాహ్నం 2.15 గంటలకు గన్నవరం నేరుగా తిరుపతి చేరుకుంటారు. 4.10 గంటలకు తిరుపతి నుంచి రోడ్డు మార్గం ద్వారా అలిపిరి వెళ్తారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండకు చేరుకుంటారు. రాత్రికి తిరుమల గాయత్రి గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. రేపు అంటే అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9.50 గంటలకు గాయత్రి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి స్వామిని దర్శించుకుంటారు. ఉదయం 11 గంటల వరకూ దర్శనంలో ఉంటారు.
ఆ తరువాత 11.05 నుంచి 12 గంటల వరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం పరిశీలిస్తారు. అక్కడ్నించి తిరిగి తిరుమల గాయత్రి గెస్ట్ హౌస్ చేరుకుంటారు. మద్యాహ్నం భోజనం డిన్నర్ అక్కడే చేసి రాత్రికి బస చేస్తారు. తిరిగి అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు తిరుమల నుంచి తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభకు చేరుకుంటారు. రాత్రి 8 గంటల వరకు వారాహి సభలో పాల్గొంటారు. రాత్రి 8.30 గంటలకు తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి గన్నవరం చేరుకుంటారు. ఆ తరువాత అక్కడి నుంచి మంగళగిరి క్యాంప్ కార్యాలయానికి వెళతారు.
Also read: Dates and Ghee Benefits: నెయ్యిలో ఖర్జూరం నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.