Tirumala Tickets Online: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఈ నెల 20న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని చెప్పారు. ఈ టికెట్లు పొందిన వారు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఈ నెల 20వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్‌లైన్ కోటాను ఈ 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. జూలై నెలకు సంబంధించి ఈ 21వ తేదీన ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు ఆన్‌లైన్‌ అందుబాటులోకి రానున్నాయి. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న ‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుదల చేయనుంది. 


అదేవిధంగా వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, జూన్ నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి రానున్నాయి. మే, జూన్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా టికెట్లు ఈ నెల 25వ తేదీన  విడుదల అవుతాయి. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు. 


Also Read: OPS Latest Update: ఉద్యోగులకు తీపికబురు.. ఓపీఎస్‌ అమలుకు నోటిఫికేషన్


ఇక ఇటీవలె దర్శన టోకెన్ల విషయంలో టీటీడీ కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. అలిపిరి నుంచి కాలినడకన స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు గతంలో గాలి గోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయగా.. ఈ నెల 14వ తేదీ నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో దర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. గాలి గోపురం దగ్గర కచ్చితంగా టోకెన్ స్కాన్‌ చేయించుకుని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. స్కాన్ చేయించుకోకుండా వెళ్లినా.. ఇతర మార్గాల్లో తిరుమలకు వెళ్లినా స్వామి వారిని దర్శనానికి అనుమతించమని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. 


Also Read: Tax Saving Tips 2023: ఇలా చేయండి.. రూ.12 లక్షల జీతంపై ఒక్క రూపాయి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook