TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో మరోసారి నిబంధనలకు తిలోదకాలిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ బ్రేక్ దర్శనం విషయంలో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిబంధనలు బేఖాతరయ్యాయి. ఆలయ నిబంధనల్ని ఉద్యోగులు ఉల్లంఘించి ఆక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. టీటీడీ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ బయోమెట్రిక్ మార్గం ద్వారా కొందరు భక్తులు శ్రీవారి ఆలయంలో ప్రవేశించడం వివాదాస్పదంగా మారింది. టీటీడీ ఛైర్మన్ సిబ్బందితో వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆలయ ప్రవేశం చేయించడంతో ఈ ఘటన జరిగింది. ఆలయ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు భక్తుల్నించి పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రోటోకాల్ దర్శనం పేరుతో భక్తుల్ని లోపలకు తీసుకువెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. 


ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు రహస్యంగా విచారణ కూడా చేపట్టారు. బయోమెట్రిక్ లేకుండానే కొంతమందిని లోపలకు తీసుకెళ్లిన దృశ్యాల్ని సీసీటీవీ కెమేరాల ద్వారా పరిశీలించినట్టు సమాచారం. టీటీడీలో బయోమెట్రిక్ పవేశం, నిబంధనల ఉల్లంఘనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనం జరుగుతున్నప్పుడు ఆలయంలో ఎవరు తీసుకెళ్లారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలా జరుగుతుంటే విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 


టీటీడీ (TTD) ఈ వివాదం జరుగుతుండగానే..అటు ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది. 3 వేల 171 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ ఏడాది బడ్దెట్‌కు బోర్డు ఆమోదం తెలపనుంది. హుండీ ఆదాయాన్ని వేయి కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుండటంతో ఆంక్షల్ని సవరించనున్నారు. శ్రీవార్జి ఆర్జిత సేవలకు భక్తుల్ని తిరిగి అనుమతించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పీఆర్సీని టీటీడీలో కూడా అమలు చేయాలనేది బోర్డు నిర్ణయంగా ఉంది. 


Also read: APPSC: గౌతమ్ సవాంగ్‌కు కొత్త బాధ్యతలు, ఏపీపీఎస్‌సి ఛైర్మన్‌గా నియామకం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook