Video: మళ్లీ మళ్లీ అదే సీన్... నిస్సహాయ స్థితిలో బిడ్డ మృతదేహాన్ని బైక్‌పై తరలించిన తండ్రి
Helpless father carries daughter body on bike: 108 అంబులెన్స్ సిబ్బంది నిరాకరించడంతో ఓ తండ్రి నిస్సహాయ స్థితిలో తన రెండేళ్ల కూతురి మృతదేహాన్ని బైక్‌పై తరలించాడు.
Helpless father carries daughter body on bike: ఇటీవల తిరుపతి రుయా ఆసుపత్రిలో చోటు చేసుకున్న అమానవీయ ఘటన జిల్లాలో మరోసారి రిపీట్ అయింది. నాయుడు పేట ప్రభుత్వ ఆసుపత్రిలో 108 సిబ్బంది రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని తరలించేందుకు నిరాకరించారు. ఆటోలో తీసుకెళ్దామంటే... ఆటో డ్రైవర్లు ఎవరూ ముందుకు రాలేదు. ప్రైవేట్ అంబులెన్స్‌లో తీసుకెళ్లేంత డబ్బులు లేవు. దీంతో నిస్సహాయ స్థితిలో ఆ తండ్రి బైక్ పైనే ఆ పసిబిడ్డ మృతదేహాన్ని తరలించాడు.
వివరాల్లోకి వెళ్తే... తిరుపతి జిల్లాలోని దొరవారి సత్రం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అక్షయ (2) అనే చిన్నారి గురువారం (మే 5) ప్రమాదవశాత్తు గ్రావెల్ గుంతలో పడిపోయింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తరలించాల్సిందిగా 108 సిబ్బందిని కోరారు. కానీ అందుకు వారు నిరాకరించారు.
ఆటో డ్రైవర్లు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ చిన్నారి తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరకు చిన్నారి మృతదేహాన్ని తన భుజంపై వేసుకుని బైక్ పైనే ఇంటికి తరలించాడు. దాదాపు 18 కి.మీ తన బిడ్డ మృతదేహంతో బైక్‌పై ప్రయాణించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఆ తండ్రిని ఆరా తీయగా అతను కన్నీరుమున్నీరుగా విలపించినట్లు తెలుస్తోంది.
బుధవారం (మే 5) నెల్లూరు జిల్లాలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 108 అంబులెన్స్ సిబ్బంది నిరాకరించడంతో ఓ తండ్రి తన కొడుకు మృతదేహాన్ని బైక్ పైనే ఇంటికి తరలించాడు. అంతకుముందు, తిరుపతి రుయా ఆసుపత్రిలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. 108 అంబులెన్స్ సిబ్బంది నిరాకరించడంతో ఓ తండ్రి తన కొడుకు మృతదేహాన్ని బైక్ పైనే ఇంటికి తరలించాడు. దాదాపు 90 కి.మీ బైక్‌పై మృతదేహంతో ప్రయాణించాడు. ఈ వరుస ఘటనలతో 108 సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Adi shankaracharya: నేడు ఆది శంకరాచార్య జయంతి... అద్వైత సిద్దాంతకర్త గూర్చి ఈ విషయాలు మీకు తెలుసా...
Also Read: David Warner Record: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.