Tirupati Bypoll: తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన పార్టీ  వైఖరిపై స్పష్టత కొరవడింది. బీజేపీ-జనసేన పొత్తు ఉంటుందా అనేది అనుమానంగా మారింది. బీజేపీ అభ్యర్ధి నామినేషన్ కార్యక్రమంలో జనసేన కన్పించకపోవడం చర్చనీయాంశమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు ఆకస్మిక మరణం(Sudden demisal of Tirupati Mp) తో తిరుపతి ఉపఎన్నిక(Tirupati Bypoll) అనివార్యమైంది. ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి ఉప ఎన్నిక జరగనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr congress party)అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తి నెల్లూరు కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నెల్లూరు పార్టీ కార్యాలయానికి చేరుకుని దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వీఆర్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. తిరుపతి వైసీపీ అభ్యర్ధి వెంట వైసీపీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు , కార్యకర్తలు ర్యాలీగా చేరుకున్నారు. 


ఇక ఇదే ఎన్నికల్లో టీడీపీ తరపున మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి బరిలో ఉన్నారు. ఇక బీజేపీ-జనసేన (Bjp-Janasena)అభ్యర్ధిగా బీజేపీ నేత రత్నప్రభ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా జనసేన నామినేషన్ కార్యక్రమంలో కన్పించకపోవడం చర్చనీయంశమైంది. దాంతో బీజేపీ-జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం నెలకొంది. కేవలం బీజేపీ నేతలు, కార్యకర్తలతోనే  రత్నప్రభ నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియలో జనసేన నేతలు లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. బీజేపీ, జనసేన మధ్య తీవ్ర అంతరం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తారని బీజేపీ (Bjp) ముందు నుంచే హడావుడి చేసినా.. ప్రస్తుత పరిణామాలతో అనేక అనుమానాలు తలెత్తున్నాయి.


Also read: YS Jagan Holi Wishes: హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook