Police seizes Red Sandalwood Logs : ఎర్రచందనం దుంగల్ని లారీలో లోడ్‌ చేస్తుండగా.. కూలీలు, స్మగ్లర్లపై పోలీసులు అటాక్ చేశారు. ఈ ఘటన తిరుపతి పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం చ్యామల రేంజ్ పరిధిలోని చిన్నగొట్టిగల్లు ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను లారీలో లోడ్ చేస్తుండగా ఫారెస్ట్ ఆఫీసర్ కెఎస్‌కె లింగాధర్ బృందం దాడి చేపట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కూంబింగ్‌లో 6 మంది కూలీలను ఫారెస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసులు వచ్చారనే సమచారం తెలుసుకున్న ఎర్రంచందనం (Red Sandalwood Logs) స్మగ్లర్లు కొందరు అడవిలో నుంచి పరారయ్యారు.


స్మగ్లర్ల నుంచి 9 దుంగలను, ఒక లారీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనం దుంగల విలువ లక్షలాది రూపాయలు ఉంటుంది. ఈ కేసుకు సంబంధించిన విషయాలను టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ మీడియాకు వెల్లడించారు. 


అదుపులోకి తీసుకున్న ఎర్రచందనం కూలీలు.. (Red Sandalwood Workers) తమిళనాడు.. తిరువన్నామలైకు చెందిన వారని వివరించారు. రమేష్, దొరైస్వామి, కుమారస్వామి, పొన్ను స్వామి, ఆనందన్, మది అలగన్‌లను తాము అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇక ఈ ఏడాదికి చ్యామల రేంజ్ పరిధిలో ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్ తరలించినట్టు వెల్లడించారు.


Also Read : Telangana Night Curfew: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ.. డీహెచ్ శ్రీనివాసరావు కీలక ప్రకటన


కాగా ఎర్రచందనం కూలీలంతా కూడా తమిళనాడులోని పలు ప్రాంతాల్లోకి చెందిన వారు, అలాగే పాండిచేరి, చెన్నైకి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరంతా స్మగ్లర్లకు సాయం చేయడంతో.. ఎర్రచందనం దుంగలను చైనా, జపాన్‌కు అక్రమంగా తరలించి ఈజీగా డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు స్మగర్లు.


Also Read : US President Joe Biden: రిపోర్టర్ ను అసభ్య పదజాలంతో దూషించిన బైడెన్, వీడియో వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.