Pawan Kalyan vs Shyamla:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు  డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి లడ్డూ కల్తీ అయ్యిందని ప్రచారం జరిగింది. అంతేకాదు అందులో పంది కొవ్వు కలిపారు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు.  దీంతో స్వామివారి లడ్డూ ప్రసాదం అపవిత్రమైందని భావించిన పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు.  అయితే ఇప్పుడు ఈ దీక్షను దృష్టిలో పెట్టుకొని యాంకర్ శ్యామల మరోసారి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయంలోకి వెళ్తే మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం దాదాపు మూడు లక్షల లడ్డూలను ప్రసాదంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 9వ తేదీన కనకదుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. పోయిన ఏడాది శరన్నవరాత్రుల్లో 25 లక్షల లడ్డూ లను భక్తులు కొనుగోలు చేయగా.. ఇప్పుడు మరో మూడు రోజులపాటు భక్తులు ఇంద్రకీలాద్రి కి భారీగా తరలివస్తారు.  భవాని భక్తులు దక్షిణాది రాష్ట్రాల నుంచి అమ్మవారి దర్శనానికి తరలివస్తారు. 



అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ లో కల్తీపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయంగా పేరు తెచ్చుకున్న కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదం విషయంలో కూడా అపోహలు తలెత్తకుండా ఉండడానికి అత్యంత నాణ్యవంతంగా లడ్డూలను తయారు చేయవలసిందిగా కలెక్టర్ సృజన దేవస్థానం ఈవోను ఆదేశించడం జరిగింది.



ఈ నేపథ్యంలోనే కలెక్టర్ సృజన లడ్డూ ప్రసాద తయారీ కేంద్రానికి చేరుకొని లడ్డూ ప్రసాదానికి వినియోగిస్తున్న పదార్థాలను స్వయంగా తనిఖీ చేసింది. అంతేకాదు విజయ నెయ్యి నాణ్యతను పరిశీలించి లడ్డు నాణ్యతను తెలుసుకోవడానికి రుచి,  లడ్డు బరువు తూకం వేయించి చూశారు.



అయితే అదే సమయంలో సృజన లడ్డు రుచి చూడడంతో.. స్వామివారికి నైవేద్యంగా పెట్టే లడ్డును ఇలా రుచి చూడవచ్చా అంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యాంకర్ శ్యామల మాట్లాడుతూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విధంగా పోస్ట్ చేసింది. 



తన ట్విట్టర్ ఖాతాలో.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాపచారం జరిగిపోయింది. స్వామివారికి పెట్టే ప్రసాదం అపవిత్రమైంది.సనాతన ధర్మం ప్రకారం స్వామి వారికి పెట్టే ప్రసాదాన్ని వాసన కానీ రుచి కానీ చూడకూడదు. కాబట్టి మీరు వెంటనే సిద్ధం,  అయిపోండి. ఈసారి దీక్ష మామూలుగా ఉండకూడదు.  బహిరంగ సభలు పెట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ భాషలో ఉపన్యాసాలు ఇవ్వాలి.  పూనకం వచ్చిన మాదిరి ఊగిపోవాలి అంటూ కలెక్టర్ సృజన ప్రసాదం రుచి చూస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేసింది.  ఈ విషయాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


 



Read more:  Tirumala: తిరుమలలో దివ్వెల మాధురి ఓవరాక్షన్‌.. మాడవీధుల్లో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌.. వీడియో వైరల్..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.