Tirumala: తిరుమలలో దివ్వెల మాధురి ఓవరాక్షన్‌.. మాడవీధుల్లో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌.. వీడియో వైరల్..

Duvvada Srinivas and Divvela madhuri: ఎమ్మెల్సీ  దువ్వాడ శ్రీనివాస్ తన ప్రియురాలు దివ్వెల మాధురితో కలిసి తిరుమలలో హల్ చల్ చేశారు. అంతే కాకుండా..  తొందరలోనే గుడ్ న్యూస్ చెప్తామని కూడా మాట్లాడారు. ప్రస్తుతం వీరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 7, 2024, 09:18 PM IST
  • తిరుమలలో రెచ్చిపోయిన దువ్వాడ శ్రీనివాస్..
  • ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న శ్రీవారి భక్తులు..
Tirumala: తిరుమలలో దివ్వెల మాధురి ఓవరాక్షన్‌.. మాడవీధుల్లో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌..  వీడియో వైరల్..

Duvvada Srinivas and Divvela madhuri prewedding shoot: టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి ట్రెండింగ్ లో నిలిచారు. ఆయన తన ప్రియురాలితో కలిసి తిరుమల మాడవీధుల్లో హల్ చల్ చేశారు. కొద్దిరోజుల క్రితం దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణిల మధ్య వివాదాలు పీక్స్ కు చేరిన విషయం తెలిసిందే. వాణి తన భర్త ఇంటి ముందు కదలకుండా.. కొన్ని రోజుల పాటు అలానే కూర్చుండిపోయింది. ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధుతో లివింగ్ రిలేషన్ లో ఉన్నారని, ఆయన భార్య వాపోయింది.

Add Zee News as a Preferred Source

 

అంతేకాకుండా.. తనను పట్టించుకొవట్లేదని, ఆస్తులన్ని ఆమెకు రాసిస్తున్నారని వాపోయింది. దీంతో ఇది ఏపీలో పెద్ద రచ్చగా మారింది. ఈ క్రమంలో వైసీపీ టెక్కలి నియోజక వర్గం బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించింది. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ మాత్రం..తాను... దివ్వెల మాధురితో ఉంటానని తెల్చిచెప్పారు. వీరి కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. అయితే.. వీరిద్దరు కలసి తిరుమల మాడ వీధులలో హల్ చల్ చేశారు. 

పూర్తి వివరాలు..

తిరుమల మాడవీధుల్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ రచ్చ చేశారు. వీఐపీ దర్శనంలో భాగంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అంతే కాకుండా మాడ వీధుల్లో ఫోటోలు,వీడియోలు తీసుకుంటూ రచ్చ చేశారు. వీరిద్దరు కలిసి ప్రీవెడ్డింగ్ షూట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం తాము.. కలిసే ఉంటున్నామని, కోర్టు పరిధిలో తమ కేసు ఉండటం వల్ల .. తుది తీర్పు వచ్చాక పెళ్లి చేసుకుంటామని దివ్వెల మాధూరీ చెప్పుకొచ్చారు.

Read more: Vijayawada: ఇజ్జత్ తీసిన పోలీసులు.. ఇంద్ర కీలాద్రి వద్ద డ్యూటీలకు వెళ్లి పాడుపని.. వీడియో వైరల్..

అయితే.. రెండేళ్ల నుంచి ఇద్దరు కూడా కలిసే ఉంటున్నట్లు కూడా చెప్పారు. ఇద్దరు కలిసి తిరుమలలో ఫోటోలు దిగుతూ.. వీడియోలు తీసుకుంటూ రచ్చ చేశారు. అయితే... అసలే శ్రీవారి ఆలయం..అది కూడా బ్రహోత్సవాల సమయంలో వీరు ఇలా చేయడం పట్ల శ్రీవారి భక్తులు మాత్రం తీవ్ర  ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీరిపై చర్యలు తీసుకొవాలని కూడా టీటీడీని కోరినట్లు సమాచారం. ఇక వీరి వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News