AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల వివాదం ఇంకా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగిందనేది కొందరి వాదన. హిందూపురం కేంద్రంగా జిల్లా ఉండాలనే డిమాండ్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆందోళన తీవ్రతరం చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలుస్తానంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ రాష్ట్రం 26 కొత్త జిల్లాలుగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కొన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉద్యమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురం ఉండాలనేది ప్రధాన డిమాండ్. ఇదే డిమాండ్‌తో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మౌనదీక్ష చేపట్టారు.


హిందూపురంను కేంద్రంగా చేసేంతవరకూ పోరాటాన్ని ఆపేది లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను(Ap cm ys jagan) కలుస్తానని చెప్పారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే జిల్లాల వివాదాన్ని తెరపై తీసుకొచ్చారని బాలకృష్ణ విమర్శించారు. హిందూపురం వంటి పట్టణాన్ని పక్కనబెట్టి..పుట్టపర్తి వంటి చిన్న మండలాన్ని కేంద్రం చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఎన్టీ రామారావుపై ప్రేమతో ఎన్టీఆర్ జిల్లా ప్రకటించలేదని..రాజకీయ కారణాలున్నాయన్నారు. మరోవైపు రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్న ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాలుకు సిద్ధమేనన్నారు. హిందూపురం జిల్లా కేంద్రం కోసం అందరితో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. అన్ని అంశాల్లోనూ ప్రభుత్వం వివాదం చేస్తోందని బాలకృష్ణ విమర్శించారు.


Also read: Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 సినిమాలు, 75 మిలియన్ల వ్యూస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook