Pithapuram Pawan Kalyan: దేశం దృష్టిని ఆకర్షించిన పిఠాపురం ఎన్నికలో విజయం సాధించి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన పవన్‌ కల్యాణ్‌ మరోసారి నియోజకవర్గ పర్యటన చేపట్టనున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే మూడు నాలుగు సార్లు నియోజకవర్గంలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌ తాజాగా మళ్లీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే పిఠాపురం నియోజక పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu Kiss: సీఎం చంద్రబాబుకు ప్రేమతో ముద్దు పెట్టిన మహిళ.. వీడియో వైరల్‌


కాకినాడ  జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. రేపు, ఎల్లుండి అంటే ఈ నెల 4, 5 తేదీల్లో పవన్‌ పిఠాపురం పర్యటన ఖరారు అయింది. నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ అభిమానులతోపాటు టీడీపీ, జనసేన పార్టీలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ షెడ్యూల్‌ ఇలా...|


Also Read: Pawan Kalyan: వైఎస్‌ జగన్‌ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్‌


రేపు సోమవారం


  • 4వ తేదీ ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 11:30 గంటలకు గంటలకు నేరుగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్‌కు చేరుకుంటారు. సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం చేస్తారు.

  • గొల్లప్రోలు హౌసింగ్ కాలనీకి శంకుస్థాపన

  • సూరంపేట హ్యాబిటేషన్‌కు మంజూరైన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

  • గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్‌ ప్రారంభం

  • గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంలో పనులు ప్రారంభిస్తారు .

  • మధ్యాహ్నం ఒంటిగంటకు చేబ్రోలులోని తన నివాసానికి డిప్యూటీ సీఎం పవన్‌ చేరుకుంటారు .

  • మూడు గంటలకు చేబ్రోలు నుంచి బయలుదేరి పిఠాపురంలోని టీటీడీ కల్యాణ మండపం చేరుకుని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రారంభోత్సవం, కల్యాణ మండపం మరమ్మతు పనులు, ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మరమ్మతు పనులు ప్రారంభం. 

  • పిఠాపురంలోని బాదం మాధవ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రారంభం

  • కాకినాడ రూరల్‌లోని పీ వెంకటాపురం వసతిగృహం చేరుకుంటారు. అనంతరం చేబ్రోలులోని తన నివాసానికి వెళ్లి అక్కడే నిద్రిస్తారు.


ఎల్లుండి షెడ్యూల్‌


  • ఐదో తేదీ మంగళవారం నివాసం నుంచి బయలుదేరి ఈ కొత్తపల్లి పీహెచ్‌సీకి చేరుకుంటారు. పీహెచ్‌ఎస్‌ ఔట్ పేషెంట్ విభాగానికి శంకుస్థాపన, యు కొత్తపల్లి మండలంలోని పలు పాఠశాలలకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తన నివాసానికి చేరుకుని మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్‌కు బయలుదేరుతారు. అక్కడినుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు. ఈ రెండు రోజుల పర్యటన కోసం సొంత నియోజకవర్గం వస్తుండడంతో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు భారీ ఎత్తున పిఠాపురం చేరుకుంటున్నారు. డిప్యూటీ సీఎం బందోబస్తును కలెక్టర్ షామ్ మోహన సగిలి నేతృత్వంలో అధికారుల సేవలు చకచకా కొనసాగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి