Cheating: ట్రావెల్స్ ఏజెన్సీ మోసం...కశ్మీర్లో చిక్కుకుపోయిన సిక్కోలు వాసులు..
సింధు పుష్కరాలకు జమ్ముకశ్మీర్ కు వెళ్లిన సిక్కోలు వాసులకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ట్రావెల్ ఏజెన్సీ మోసం చేయటంతో...వారు అక్కడ చిక్కుకుపోయారు.
Travel Agency Cheating: ఓ ట్రావెల్ ఏజెన్సీ మోసం చేయడంతో..సింధు పుష్కరాల కోసం జమ్ముకశ్మీర్ కు వెళ్లిన శ్రీకాకుళం వాసులు(srikakulam residents) అక్కడ చిక్కుకుపోయారు.
వివరాల్లోకి వెళితే..
మైసూర్‌కు చెందిన అకుల్ ట్రావెల్స్ ఏజెన్సీ(Travel Agency) ప్రతినిధులు.. శ్రీకాకుళం స్థానికులను టూరిజం పేరుతో యాత్రకు తీసుకెళ్లారు. ఒక్కొ జంట నుంచి 60 వేలను ట్రావెల్ సిబ్బంది వసూలుచేశారు. ఈ క్రమంలో 120 మంది యాత్రికులు జమ్ముకశ్మీర్(jammu kashmir)లోని కట్రా వద్ద హోటల్‌కి చేరుకున్నారు.
Also Read:Visakhapatnam: 'అమెజాన్' ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి విక్రయం..నలుగురు అరెస్ట్..
ఆ తర్వాత.. ట్రావెల్ సిబ్బంది యాత్రికుల(Pilgrims)ను అక్కడ వదిలేసి పరారయ్యారు. దీంతో హోటల్ వారు డబ్బులు కట్టాలని 120 మంది యాత్రికులు నిర్భందించారు. ప్రతి ఒక్కరు.. తలా పదివేలు కట్టాలంటూ యాత్రికులను హోటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. దీంతో యాత్రికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యాత్రికులలో ఎక్కువగా.. పాలకొండ, నరసన్నపేట గ్రామానికి చెందిన వారున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook