Visakhapatnam: 'అమెజాన్‌' ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి విక్రయం..నలుగురు అరెస్ట్..

Crime news: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ 'అమెజాన్‌'’ ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు విశాఖలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 01:47 PM IST
  • అమెజాన్ ద్వారా గంజాయి స్మగింగ్
  • విశాఖ కేంద్రంగా దందా
  • నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Visakhapatnam: 'అమెజాన్‌' ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి విక్రయం..నలుగురు అరెస్ట్..

Cannabis smuggling in Amazon: గంజాయి స్మగ్లింగ్(cannabis smuggling) కు కేటుగాళ్లు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎవ‌రికీ అనుమానం రాకుండా ఆన్‌లైన్‌ ద్వారా గంజాయి(cannabis)ను విక్రయిస్తున్నారు. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ‘అమెజాన్‌(Amazon)’ ద్వారా విశాఖపట్నం నుంచి మధ్యప్రదేశ్ కు గంజాయి సరఫరా అవుతున్న వ్యవహారాన్ని అక్కడి పోలీసులు ఛేదించారు. విచారణలో భాగంగా...విశాఖ(Visakhapatnam) నగరానికి వచ్చిన ఎంపీ పోలీసులు గంజాయిని సరఫరా చేసే శ్రీనివాస్‌ అనే వ్యక్తితో పాటు అమెజాన్ పికప్ బాయ్స్ కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Also Read: Food Poisoning In School: ఫుడ్ పాయిజన్ వల్ల 70 మంది విద్యార్థినులకు అస్వస్థత

ఈ నెల 13న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఓ దాబాలో గంజాయి పట్టుబడటంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ నుంచి అమెజాన్ యాప్‌(Amazon APP) ద్వారా గంజాయి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. విశాఖ నుంచి వచ్చిన గంజాయిని పికప్‌ చేసుకునే ముగ్గురిని మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని బెండీ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఆ కేసులో భాగంగానే విచారణ నిమిత్తం.. మధ్యప్రదేశ్ పోలీసులు ఇవాళ విశాఖ చేరుకున్నారు. వీరితో పాటు ఎస్ఈబీ అధికారులు కూడా రంగంలోకి దిగారు.

Also Read: Tragedy: హైదరాబాద్ లో విషాదం...చీరకు నిప్పంటుకొని గర్భిణి మృతి..

అమెజాన్ పికప్ బాయ్స్ సహకారంతో కరివేపాకు పొడి, హెర్బల్‌ పౌడర్ల పేరుతో గంజాయి(Marijuana)ని విశాఖ నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు చేసి అమెజాన్ స్టిక్కర్లు, ప్యాకింగ్ మెటీరియల్‌తో పాటు కొంత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు నిందితులు విశాఖలోని కంచరపాలెం ఇండస్ట్రీయల్ ఎస్టే్‌ట్‌లోని స్టోర్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులు పేర్కొన్నారు.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News