TTD: తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

TTD Darshanam | తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చే వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ( TTD Board) ఓ విజ్ఞప్తి చేసింది.
TTD Darshanam | తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చే వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ( TTD Board) ఓ విజ్ఞప్తి చేసింది. తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేస్తున్న టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ల కోటా జూన్ 26వ తేదీ వరకు పూర్తయిందని... కోవిడ్-19 నిబంధనలు ( COVID-19) అమల్లో ఉన్నప్పటికీ సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల కోసం దూరప్రాంతాల నుంచి భక్తులు తిరుపతికి వచ్చి రోజుల తరబడి ఇక్కడే వేచి ఉంటూ ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని టీటీడీ భక్తుల దృష్టికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
టిటిడి అధికారులు సమీక్ష తరిపిన అనంతరం జూన్ 27వ తేదీ, ఆ తరువాత కేటాయించే టోకెన్ల గురించి తెలియజేయడం జరుగుతుందని.. అప్పటివరకు సర్వ దర్శనం టోకెన్స్ లేకుండా భక్తులు ఎవ్వరూ తిరుమలకు రావొద్దని టీటీడీ కోరింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..