TTD: తిరుమల తిరుపతి దేవస్థానం మూడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు(VIP Break Darshan cancelled at tirumala) చేస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13, 14, 15వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుప‌తి(Tirupathi) న‌గ‌రంలో ఈ నెల 14వ తేదీన సదరన్ జోనల్ కౌన్సిల్‌ సమావేశం(Southern Zonal Council Meeting) హోంమంత్రి అమిత్ షా(Amit Shah) అధ్యక్షతన జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు రానున్నారు. ఈ నేప‌థ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు చెప్పింది. ఈ కారణంగా నవంబ‌ర్ 12, 13 14వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ(Tirumala Tirupati Devasthanam) విజ్ఞప్తి చేసింది.


Also read: CBN Demands To Cut Petrol Price: ఏపీలో పెట్రో ధరలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్!


ఈ నెల 14న తిరుపతిలో దక్షిణాధి రాష్ట్రాల సమావేశం జరగనున్న సందర్భంగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్(CM Jagan)​ గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ప్రస్తావించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చకు పెట్టాలని తీర్మానించింది.  


తిరుమల స్వామివారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ట్, తెలంగాణ రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, సినీ దర్శకుడు గోపీచంద్ దర్శించుకున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి