TTD Members List: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ప్రకటనపై అందరి దృష్టి నెలకొంది. మరో 2-3 రోజుల్లో పాలకమండలిని ప్రకటించనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో సభ్యుల సంఖ్య పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీటీడీ పాలకమండలిపై(TTD) ఇప్పుడు చర్చ నడుస్తోంది. కొత్త పాలకమండలిని త్వరలోనే ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయమై సమాలోచన చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి సభ్యుల జాబితా ఖరారయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సభ్యుల సంఖ్యను పెంచే విషయమై చర్చ సాగుతోంది.


టీటీడీ పాలకమండలిలో సభ్యుల సంఖ్యను పెంచాలా వద్దా అనే అంశం ఇంకా ఖరారు కాలేదు. జాబితా సిద్ధం కాకపోవడానికి కారణం కూడా ఇదేనని తెలుస్తోంది. గత పాలకమండలిలో ఉన్నట్టే ఛైర్మన్ కాకుండా 24 మంది సభ్యులుండవచ్చనే వాదన విన్పిస్తోంది. ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్యను 40కు పెంచనున్నారని మరో సమచారం వస్తోంది. అటు సభ్యుల సంఖ్యను కూడా 24 నుంచి 52కు పెంచనున్నారనే వార్తలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్యను పెంచాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీన జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ అంశం చర్చకు రావచ్చు. తెలంగాణా, కర్ణాటక, తమిళనాడుతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి కూడా ఈసారి టీటీడీలో సభ్యత్వం కోసం సిఫార్సులు వచ్చాయి. ఈక్రమంలో పాలక మండలి సభ్యుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 


Also read: America Green Card: అమెరికా గ్రీన్‌కార్డు ఇకపై సులభమే..సూపర్ ఫీ చెల్లిస్తే చాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook