TTD Tickets: శ్రీవారి దర్శనానికి టికెట్ల కోటాలు పెంపు- కొవిడ్ తగ్గడమే కారణం!
TTD Tickets: శ్రీవారి సర్వదర్శనానికి భక్త జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనం టికెట్ల కోటాను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
TTD Tickets: తిరుమల వెంకన్నను దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం, భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్య దర్శనం టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
టికెట్ల పరిమితి పెంపు...
పరిమిత సంఖ్యలో సర్వ దర్శనం టికెట్ల జారీ కారణంగా తిరుమలకు వస్తున్న భక్తులు.. టికెట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. దర్శనం ఎప్పుడు అవుతుందో అనే విషయంపై స్పష్టత లేకపోవడం ఇది పెద్ద సమస్యగా తయారైంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టికెట్ల పెంపునకు టీటీడీ సిద్ధమైనట్లు తెలిసింది.
మంగళవారం నుంచి సర్వ దర్శనంకోసం వేచి చూసే భక్తుల కోసం 20 వేల టికెట్లను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ వర్గాల వెల్లడించాయి. అంతే కాకుండా ఈ నెల 24 నుంచి మార్చి 31 వరకు ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ రేపటి నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది.
రూ.300 దర్శనం టికెట్ల సంఖ్యను కూడా 25 వేలకు పెంచినట్లు టీటీడీ వర్గాల పేర్కొన్నాయి. దీనితో భక్తుల రద్దీ పెరిగిన ఎవరికీ ఇబ్బంది లేకుండా దర్శనానికి వీలు కలగనుందని టీటీడీ భావిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook