TTD Darshanam Tickets: శ్రీవారి భక్తులకు ఇది శుభవార్త. త్వరలో ఆఫ్‌లైన్‌లో సైతం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 15 వ తేదీ మధ్యలో  దర్శనానికి సంబంధించిన సర్వ దర్శనం టోకెన్లను మాత్రమే జారీ చేశారు. 3 వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. విడుదల చేసిన నిమిషాల్లోనే అన్నీ అయిపోయాయి. ఫిబ్రవరి నెలలో రోజుకు 12 వేల చొప్పున ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదలయ్యాయి. ఫిబ్రవరి నెల స్లాట్‌లో సర్వదర్శనం టికెట్లు కాస్సేపటి క్రితం విడుదలయ్యాయి. ఇవి రోజుకు పదివేల చొప్పున విడుదల చేశారు. ఫిబ్రవరి 15 నాటికి ఒమిక్రాన్ (Omicron ) తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్న నేపద్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 


కోవిడ్ సంక్రమణ నేపద్యంలో సెప్టెంబర్ 25 నుంచి ఆఫ్‌లైన్ టికెట్ల (Online Tickets) జారీ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్ల పంపిణీ గ్రామీణులకు ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదనే అభిప్రాయం ఉంది. ఈ నేపధ్యంలో టీటీడీ (TTD) గుడ్‌న్యూస్ అందించింది. సామాన్య భక్తులకు సైతం ప్రాధాన్యత కలిగేలా..త్వరలో ఆఫ్‌లైన్ దర్శనం టికెట్లను విడుదల చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (Yv Subbareddy) ప్రకటించారు. కోవిడ్ కారణంగానే..ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని విధిలేని పరిస్థితుల్లో ఆన్‌లైన్ విధానం పెట్టాల్సి వచ్చిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. గతంలో చాలాసార్లు ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ కోసం ఆలోచించామని..అయితే కోవిడ్ సంక్రమణ దృష్ట్యా సాధ్యం కాలేదన్నారు. ఫిబ్రవరి 15వ తేదీన కోవిడ్ సంక్రమణను అంచనా వేసిన తరువాత ఆఫ్‌లైన్ టోకెన్ ( Offline Tokens) జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 


కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో..శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమైన పర్వ దినాల్లో నిర్వహించే కళ్యాణోత్సవాన్ని కూడా వర్చువల్‌గా నిర్వహించేందుకు టిటీడీ నిర్ణయించింది. మరోవైపు తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ తొలిదశ నిర్మాణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానుందని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 


Also read : AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనాతో ఒక్క రోజే 12 మంది మృతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook