Nayanthara-Vignesh Shivan: గురువారం వివాహ జీవితంలోకి విఘ్నేష్‌ శివన్, నయనతార దంపతులు అడుగు పెట్టారు. ఈక్రమంలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు వచ్చారు. స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు నేరుగా ఓ బృందంతో మధ్యాహ్నం 12 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని ఎస్‌ఎంసీ కాటేజ్ వెనుక వైపు నుంచి సుపధం మార్గానికి వచ్చారు. వీరిని సుపధం మార్గం గుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ మీదుగా శ్రీవారి దర్శనానికి అధికారులు అనుమతించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కళ్యాణోత్సవంలో పాల్గొన్న నయనతార దంపతులు ..అనంతరం ఆలయం బయటకు చేరుకున్నారు. సాధారణంగా తిరుమలలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో చెప్పులను ధరించకూడదు. పక్కా షరతులు ఉన్నాయి. ఆలయ మహా ద్వారా గుండా బయటకు వచ్చిన విఘ్నేష్‌ శివన్, నయనతార చెప్పులు ధరించి వెళ్లారు. ఆ సమయంలో వీరిని చూసేందుకు భక్తులు బారులు తీరారు. సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. 


నయన్ దంపతులు అక్కడితో ఆగకుండా శ్రీవారి పుష్కరణి అభిముఖంగా ఫోట్‌ షూట్‌లో పాల్గొన్నారు. వివిధ రకాల ఫోజులతో ఫోటోలు దిగారు. ఎంతో పవిత్రమైన ప్రాంతంలో ఇలా చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. శ్రీవారు నడిచే మాఢవీధుల్లో చెప్పులు ధరించడం ఏంటని అంటున్నారు. దీనిపై టీటీడీ స్పందించింది. నయనతార, విఘ్నేష్‌ శివన్ దంపతుల ఫోటో షూట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మాఢ వీధుల్లో చెప్పులతో నడవడం దురదృష్టకరమని తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని..ఎలాంటి సెక్షన్ల కింద చర్యలు తీసుకోవచ్చ దానిపై చర్చిస్తున్నామని టీటీడీ పేర్కొంది.



Also read:TS Governor Tamilsai: నాకో లెక్కుంది..నన్ను ఎవరూ ఆపలేరన్న గవర్నర్ తమిళిసై..!


Also read:CM Jagan Review: ఏపీలో అక్టోబర్‌ 2న మరో నవశకం..అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook